ఇప్పుడు ప్రపంచం కరోనా అంటేనే ఉలిక్కిపడుతున్నారు.. ఇలాంటి దశలో ఇప్పటి వరకు అందరికి కరోనా ఎలా వస్తుంది. ఏ విధంగా వ్యాపిస్తుంది, దీని లక్షణాలు ఏంటనే విషయాల పట్ల అవగహన కలిగిందనే చెప్పాలి.. అయినా ఎంత తెలుసుకున్నా ఈ మొండి రోగం విషయంలో మరిన్ని కొత్త కొత్త డౌట్స్ తలెత్తుతూనే ఉన్నాయి.. ఇదిలా ఉండగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా.. ఇండియాలో మాత్రం కొంచెం కంట్రోల్‌లోనే ఉందని చెప్పవచ్చు. కరోనా కేసులు రోజులో వందలోపు నమోదు అవుతున్నప్పటికీ వాటిలో పెరుగుదల పెద్దగా ఏమీ కనిపించడం లేదు.

 

 

ఇకపోతే కొత్తగా 80 కరోనా కేసులు ఈరోజు నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే వీటితో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1200 చేరువకు వెళ్లింది. ఇదిలా ఉంటే కరోనా వల్ల ఇప్పటి వరకు 33 మంది మరణించారు. కాగా కరోనా వైరస్ శాశ్వతంగా నాశనం చేయడానికి దారులు వెతకడంలో ప్రస్తుతం అన్ని దేశాల శాస్త్రజ్ఞులు నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోనే వైరస్ మానవ శరీరంలో ప్రవేశించాక ఏమవుతుంది, ఏయో మార్గాల్లో వ్యాపిస్తుంది అనే విషయాలపై దృష్టిసారించారు.

 

 

అయితే ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం ఈ వైరస్.. తుమ్ము, దగ్గుల తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. అందుకే ప్రజలు కచ్చితంగా మాస్కు ధరించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే సహజంగానే ప్రతివారిలో ఈ వైరస్ కేవలం తుమ్ముల తుంపర్ల ద్వారానే వస్తుందా లేక శరీరంలోని ఇతర ప్లూయిడ్స్ అంటే చెమట, కన్నీరు వంటి వాటి ద్వారా వ్యాపిస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తుంది.

 

 

ఇలాంటి దశలో ఈ పరిశోధన సింగపూర్‌కు చెందిన నేషనల్ యూనివర్సిటీ హస్పిటల్ చేపట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలు జర్నల్ ఆఫ్ ఆఫ్తల్మాలజీ లో ప్రచురితమయ్యాయి. కాగా కరోనా సోకిన 17 మందిపై జరిపిన పరిశీలనలో వారి కన్నీటిలో కరోనా వైరస్ జాడ కనిపించలేదని తేలింది. కాబట్టి ఇలాంటి అనుమానాలు ఉన్న వారు ఈ విషయం తెలుసుకుని నిశ్చింతగా ఉండవచ్చూ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: