తెలంగాణ ప్ర‌భుత్వం కరోన కట్టడి కోసం అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సీఎం కేసీఆర్ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేస్తూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు వివిధ స‌ల‌హాలు, సూచ‌న‌లు, మార్గ‌ద‌ర్శ‌కాల‌తో బిజీబిజీగా ఉంటున్నారు. అయితే, ఈ క్ర‌మంలోనే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణకి పలువురు పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటించారు. ఈ మేరకు మంత్రి కే తారకరామారావు ప్రగతిభవన్లో కలిసి విరాళాలకు సంబంధించిన  చెక్కులను అందించారు. ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వంతో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు, కంపెనీల ప్రతినిధులకు, నాయకులకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒక్కరోజే సుమారు 13 కోట్ల రూపాయల విరాళాలను ముఖ్యమంత్రి సహాయనిధి కి అందించడం విశేషం.

 

---సోమ‌వారం విరాళాలు అందించిన వారి వివ‌రాలివి

 • వాల్యు లాబ్స్ - 5 కోట్ల 25 లక్షల
 • జీవీపీఆర్ ఇంజనీర్స్- కోటి రూపాయలు
 • అమర్ రాజ బ్యాటరీస్- కోటి రూపాయలు
 • ICFAI సొసైటీ- కోటి రూపాయలు
 • వంశీ రామ్ బిల్డర్స్- కోటి రూపాయలు
 • సిగ్నిటి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్- 50 ల‌క్ష‌లు
 • యునైటెడ్ స్టేట్స్ ఫార్మా  ఇండియా ప్రైవేట్ లిమిటెడ్- 50 లక్షలు
 • భాశ్యం ఎడ్యుకేషనల్ సొసైటీ- 25 లక్షలు
 • విమల ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్- 25 లక్షలు
 • స్వస్తిక్ మిర్చ్ స్టోర్- 21 లక్షలు
 • గురునానక్ ఎడ్యుకేషనల్ సొసైటీ- 11 లక్షలు

 

 • బిహెచ్అర్ డేవలపర్స్, సి ఎస్ కే రియ ల్టర్స్ లిమిటెడ్, సాయి సూర్య డెవలపర్స్, నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్, C5 ఇన్ఫ్రా లిమిటెడ్, జగత్ స్వప్న రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సాయి రూలర్ ఫ్లోర్ మిల్ ప్రైవేట్ లిమిటెడ్, చల్ల ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 10 లక్షల చొప్పున మంత్రి కేటీఆర్ కు చెక్కులను అందజేశారు

 • సీఎస్కే రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్, జాన్సన్ గ్రామర్ స్కూల్ స్కూల్ 5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు

 • ఎమ్మెల్సీ నవీన్ కుమార్ 25 లక్షలు విరాళంగా ప్రకటించి చెక్కును అందించారు

 • హైదరాబాద్ బోట్స్ క్లబ్ తరఫున 10 లక్షల రూపాయలను అందించిన బోట్స్ క్లబ్ ప్రెసిడెంట్ చెన్నాడి సుధాకర్ రావు 10 లక్షలు అందించారు
 • తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు ఎగ్గే మల్లేశం- 10 లక్షలు
 • టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి - 10 లక్షలు

మరింత సమాచారం తెలుసుకోండి: