భారత్ కు ఒక మత ప్రచారం నిమిత్తం  ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులు కరోనా ను వెంటబెట్టుకుని వచ్చారు . ఇటీవల దేశ రాజధాని నగరం లో నిర్వహించిన ఒక మతపరమైన సమావేశం లో ఇండోనేషియా కు చెందిన మతపెద్దలు పాల్గొన్నారు . వీరు అప్పటికే  కరోనా బారినపడడం తో  , ఆ సభ లో పాల్గొన్న పలువురికి కరోనా వ్యాధి సోకింది . కరోనా వ్యాధితో మృతి చెందిన  హైదరాబాద్ కు చెందిన ఒక వృద్ధుడు కూడా ఇండోనేషియా మతపెద్దలు పాల్గొన్న సభ లో పాల్గొన్నాడు . ఇకపోతే  ఇదే సభకు వెళ్లి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు చెందిన వారిలోను  పలువురికి కరోనా పాజిటివ్ లక్షణాలు కన్పించాయి . దీనితో అధికారులు అప్రమత్తమయ్యారు .

 

 ఢిల్లీ లో జరిగిన మతసభకు హాజరయిన వారి గురించి ఆరాతీసే పని లో నిమగ్నమయ్యారు . ఇక కరీంనగర్ వాసుల్ని కూడా ఇండోనేషియన్లు కరోనా భయం గుప్పిట్లోకి నెట్టారు . ఇటీవల కరీంనగర్ లో నిర్వహించిన ఒక  మతసభ లో పాల్గొనేందుకు ఇండోనేషియా కు చెందిన 11 మంది కరీంనగర్ కు చేరుకున్నారు . కరీంనగర్ చేరుకున్న ఇండోనేషియన్లకు కరోనా వ్యాధి సోకినట్లుగా అధికారులు గుర్తించారు . అయితే వారి వెంట తిరిగిన ఒక యువకుడికి కూడా కరోనా వ్యాధి సోకింది . దాంతో అతన్ని హోమ్ క్వారంటైన్ కు అధికారులు ఆదేశించారు .

 

అయితే సదరు యువకుడు హోమ్ క్వారంటైన్ నిబంధనలను పాటించకపోవడం తో,  ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా కరోనా బాధితులుగా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు . కరీంనగర్ లో ముగ్గురు  కరోనా  బాధితులు ఉన్న ఇంటి  పరిసరాల్లో ఉన్న వారికి కూడా అధికారులు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు . కరోనా బారిన పడిన ఇండోనేషియన్లు , భారత్ కు రాకపోయి ఉంటే చాలామంది ఈ వ్యాధి బారిన పడివుండే వారు కాదని వైద్యులు అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: