కరోనా వైరస్.. ఎంత డేంజరస్ వైరస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది ఏకంగా 7లక్షలమందికిపైగా సోకింది.. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ బారిన పడి ఇప్పటికే 35వేలమంది మృతి చెందారు. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ అమెరికా.. ఇటలీ.. ఇరాన్.. స్పెయిన్ వంటి దేశాల్లో అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. 

 

అయితే అమెరికాలో ఎక్కువ కేసులు నమోదు అవ్వగా ఇటలీలో కరోనా మరణాలు ఎక్కువ నమోదు అవుతున్నాయి. ఇలా తదితర అంతర్జాతీయ దేశాల్లో రోజు రోజుకు ఎక్కువ మరణాలు నమోదు అవుతున్నాయి. ఇంకా ఇటలీ తరహాలో స్పెయిన్ లో కూడా మరణాలు నమోదు అవుతున్నాయి.. అయితే స్పెయిన్ లో ఇలా అతిగా మరణాలు నమోదు కావడానికి విద్య విశ్లేషకులు ఎన్నో కారణాలు చెప్తున్నారు. 

 

ఫిబ్రవరి 19న ఇటలీలోని మిలన్‌ నగరంలో జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు స్పెయిన్‌ నుంచి మూడు వేల మంది వెలన్షియా క్లబ్‌ అభిమానులు వచ్చారు. అయితే ఇటలీలో అప్పటికే కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు 40 వేల మంది ఇటాలియన్లు కూడా వచ్చారు. వీరిలో ఎక్కువమంది ఇటలీలోని ఉత్తర ప్రాంతమైన లొంబర్డీకి చెందినవారు. అక్కడే కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. 

 

అయితే కరోనా వైరస్ బాధితులు స్టేడియంతో పాటు బార్లు, బహిరంగ ప్రదేశాల్లో వేలాదిమంది ఈ మ్యాచ్‌ను వీక్షించారు. ఆ మ్యాచ్ ముగిసిన రెండు రోజులకే లొంబర్డీ ప్రాంతంలోని ఒక ఇటలీ దేశస్థుడికి కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించాయి. అప్పటికే అతను ఎన్నో వందలమందిని కలిశాడు. ఆ వందలమంది కాస్త వేలమందికి వైరస్‌ అంటించాడు. ఇలా ఇటలీలో కరోనా వైరస్ తీవ్రత ఘోరంగా పెరిగింది. 

 

అయితే కరోనా వైరస్ తీవ్రత ఉంది అని.. చాల ప్రమాదకరమైన వైరస్ అని.. అన్ని దేశాలను వణికిస్తోంది అని చెప్పినప్పటికీ స్పెయిన్ ప్రజలు పట్టించుకోలేదు.. అందుకే ఆ కరోనా వైరస్ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఏది ఏమైనా కరోనా వైరస్ వచ్చింది అంటే అది వారి నిలక్ష్యం వల్ల అనే చెప్పాలి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: