కరోనా....ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న పేరు. చైనాలో మొదలైన ఈ వైరస్ యావత్ ప్రపంచాన్నే చుట్టేసింది. దీనికి మెడిసిన్ లేకపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మన భారతదేశం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ పాటించనుంది. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మనోళ్ళు కాస్త వెరైటీ పనులే చేస్తున్నారు. మొదట కరోనా వ్యాప్తి పెరగకుండా ఉండేందుకు ఉపయోగపడే మాస్కుల కొరత ఎక్కువైపోయిన విషయం తెలిసిందే. దీంతో మనోళ్ళు కొందరు సొంతంగా మాస్కులు తయారుచేసుకోవడం, పైగా ఆ మాస్కులకు పసుపు రాయడం చేశారు.   

 

అలాగే ఇళ్ల చుట్టూ వేపాకులు కట్టుకోవడం చేశారు. ఇక హ్యాండ్ వాష్ తప్పనిసరి కావడంతో శానిటైజర్లకు, హ్యాండ్‌వాష్‌ల కొరత పెరిగింది. అసలు కరోనా ప్రభావం మొదలవ్వడమే, వీటి కొరత మొదలైంది. అందరూ కరోనాను ఎదుర్కోవాలంటే పరిశుభ్రంగా ఉండాలన్న భావనతో వేలం వెర్రిగా శానిటైజర్లను కొనేందుకు ఎగబడ్డారు. దీంతో రోజుల వ్యవధిలోనే మార్కెట్లో శానిటైజర్లు మాయమయ్యాయి.

 

ఇక ఏపీలో కూడా ఇదే పరిస్తితి వచ్చింది. ఎక్కడ చూసిన శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌లు దొరకడం లేదు. దీంతో ప్రభుత్వం వెంటనే తయారీ సంస్ధలతో మాట్లాడి వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. కానీ అది కుదరలేదు. ఇంత తక్కువ సమయంలో తయారీ కుదరదు కాబట్టి, ప్రభుత్వ అధికారులు ఓ సరికొత్త ఆలోచన చేశారు. శానిటైజర్లు అందుబాటులో లేకపోవడంతో, కొన్ని ప్రాంతాల్లో శానిటైజర్ వెహికల్స్ ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకే వాటిని తీసుకెళుతున్నారు. ఆ వెహికల్‌లో ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ పెట్టి, అందులో శానిటైజర్లు మిక్స్ చేసి, ప్రజలకు అందుబాటులో ఉంచారు.

IHG

ఎక్కడకిక్కడ ఇలాంటి వెహికల్స్ పెట్టారు. ఇక ఈ వెహికల్ ప్రజల దగ్గరకే వెళుతుంది. దీంతో ప్రజలు ఒక్కొరిగా ట్యాంకర్ దగ్గరకు వచ్చి చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో ఈ హ్యాండ్ వాష్ ట్యాంకర్లు అందుబాటులో ఉండగా, రెండు మూడు రోజుల్లో మరిన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: