ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే..  ఈ కారొన ను నియంత్రించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాల ను తీసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.ఇక ఇప్పుడు కరోనా నియంత్రణ లో భాగం గా ప్రభుత్వం మరో ప్రయత్నాని కి సీకారం చుట్టింది. అయితే ,కరోనా నియంత్రణ లో భాగం గా జనతా కర్ఫ్యూ ను విధించింది.. అలాగే కట్టడి చేయడాని కి  ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..

 

 

 

ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి..అంతేకాకుండా సినిమా వాళ్ళు కూడా సినిమా పక్కన పెట్టి ఇంటికే పరిమాతయమయ్యాయి. 

 

 


తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది లేబర్లు, అలాగే రోజు వారీ కూలిలు ఎక్కువ గా ఉన్నారు. వారు ఎటువంటి పనులు లేకుండా కేవలం ఇళ్లకే పరిమితమయ్యాయారు.వచ్చిన డబ్బుతో గంజి తాగే వీరందరూ ఆకలితో అలమటిస్తున్నారు. వీరందరిని ప్రభుత్వం ఆదుకోవడమే కాదు రేషన్ ద్వారా బియ్యాన్ని, కందిపప్పును అందజేస్తున్నారు. ఆదివారం నుంచి రేషన్ బియ్యాన్ని అందజేస్తున్నారు. 

 

 


అయితే, రేషన్ బియ్యాన్ని కూడా కేవలం పదకొండు గంటల వరకు మాత్రమే పంపిణి చేయాలనీ ఆదేశాలు జారీచేసింది. డీలర్లు కూడా ఈ మేరకు వచ్చిన ప్రజలకు సబ్బుతో చేతులతో కడుక్కోవాలి అంటూ సూచించారు. అలాగే మనుషులను సూచించిన గదులలో మాత్రమే ఉంది సరుకులను తీసుకోవాలని సూచించారు. అలా క్యూలో ఉండి ఓ వృద్ధుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. కొద్దీ సేపటి తర్వాత అతను మృత్యువాత పడ్డారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: