క‌రోనా ప్ర‌భావంతో కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో అనేక రంగాలు స్తంభించిపోయాయి. జ‌నాలంతా ఇంటికి ప‌రిమిత‌మ‌వుతూ వ‌స్తున్నారు. సాధార‌ణ జ‌న‌జీవ‌నంలో చెప్ప‌లేనంత మార్పు వ‌చ్చింది. వారి అల‌వాట్లు, విలాసాలు, జ‌ల్సాల‌కు బ్రేక్ ప‌డింది. అయితే  దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో రాజధాని నగరాల నుంచి జనం తమ సొంత రాష్ట్రాలకు వెళుతున్నారు. అయితే కరోనా వైరస్ ప్రభావం సెక్స్ వర్కర్ల జీవితాల‌ను ఛిద్రం చేసింది. విటులు రాక‌పోవ‌డంతో క‌నీసం తిన‌డానికి కూడా డ‌బ్బులు ఉండ‌టం లేద‌ని తీవ్ర ఆవ‌దేన వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.  

 

ఇక దేశ రాజధానిలో ఉన్న సెక్స్ వర్కర్ల వెతల క‌ష్టాల‌ను తెలుసుకునేందుకు ఇటీవ‌ల ఓ  జాతీయ మీడియా సంస్థ  ప్రతినిధి మాట్లాడారు. వేశ్య‌ల బాధ‌లు వెలుగులోకి వ‌చ్చాయి. ఢిల్లీలోని జీబీ రోడ్డులో గల అజ్మీర్ గేట్ నుంచి లాహోర్ గేటు వరకు గల కిలోమీటర్ మేర వంద వరకు వేశ్యవాటికలు మూతపడ్డాయ‌ట‌. బహుళ అంతస్తుల భవనాల్లో 4 వేల మంది వేశ్యలు ఇక్క‌డ ఉంటారు. అందులో సగం వరకు ఇతర ప్రాంతాలకు వెళ్లగా.. 2 వేల మంది మాత్రం అక్కడే ఉన్నారు.  వేశ్య వాటికలో ఉన్న రష్మి (పేరు మార్చబడింది)తో ఇండియా టుడే ప్రతినిధి మాట్లాడారు. లాక్ డౌన్ నేపథ్యంలో తమ జీవితాల్లో వెలుగు లేదని ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. నిత్యావసర వస్తువుల కోసం కిరాణా షాపు, ఆరోగ్యం బాగోలేకుంటే మెడికల్ షాపుకు వెళ్లే వీలు కూడా లేదని వాపోయింది.

 

 ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో వారి బతుకు ఛిద్రమైపోయిందని క‌న్నీరు పెట్టుకుంది. మరో వేశ్య మంజరి (పేరు మార్చాం) తన నెల చిన్నారితో బ్రోతల్ హౌస్‌లో ఉంటోంది. జార్ఖండ్ శివారులో గల కుగ్రామం నుంచి వచ్చిన ఆమె.. తన కుటుంబాన్ని గడిపేందుకు ఈ ప‌ని చేయ‌క త‌ప్ప‌డం లేద‌ని పేర్కొంది. లాక్ డౌన్ నేపథ్యంలో వేశ్య వాటిక యాజమాని వెళ్లిపోయాడని.. బ్రోతల్ హౌస్ మూసివేయడంతో తాను ఇక్కడే ఎలాంటి ఉపాధి లేకుండా ఉండాల్సి వ‌స్తోంద‌ని వాపోయింది. తన వద్ద డబ్బులు లేకపోవడంతోనే పడుపు వృత్తిలోకి దిగామని,, దాంతో సర్దుకొని జీవిస్తున్నామని పేర్కొన్నారు. తనకు వచ్చే డబ్బులతో తన నెలల బిడ్డకు కడుపునిండా పాలుకూడా పట్టలేని పరిస్థితి అని మంజరి కంట‌త‌డి పెట్టింది.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: