కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జగన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రధాని పిలుపు మేరకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగించనున్నారు. అలాగే లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎవరిని బయటకు రానివ్వకుండా చూసుకుంటున్నారు. అనవసరంగా బయటకొస్తే వారి మీద చర్యలు తీసుకోవడానికి వెనుకాడటం లేదు. అసలు కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో జగన్ చాలా కఠినంగా ఉంటున్నారు. అందుకే పక్క రాష్ట్రాల నుంచి ఏపీ ప్రజలని సైతం రాష్ట్రలో అడుగుపెట్టకుండా చూసుకుంటున్నారు. ఈ విషయం బాధగా కలిగించిన తప్పదని ఉంటున్నారు.

 

అదేవిధంగా ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు తెచ్చుకునేందుకు కొంత సమయం ఇచ్చారు. ఉదయం  6 గంటల నుంచి మధ్యాహ్న 1: 30 వరకు సమయం ఇచ్చారు. ఇక ఆ సమయాన్ని చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. అసలు ఏ మాత్రం క్రమశిక్షణ పాటించకుండా అనవసరంగా రోడ్ల మీదకొచ్చేస్తున్నారు. దీంతో ఆ సమయాన్ని కూడా తగ్గించేశారు.  11 గంటల వరకే సరుకులు తెచ్చుకునేందుకు సమయం ఇచ్చారు.

 

ఇదిలా ఉంటే లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున సరుకులు, కూరగాయలు కొనేందుకు చూస్తున్నారు. ఇక ఇదే ఆసరాగా చేసుకుని వ్యాపారులు ఎక్కువ రేట్లకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అమ్ముతున్నారు. దీంతో జగన్ వారికి చెక్ పెట్టేందుకు మరో ప్లాన్ రెడీ చేశారు. వారిని గమనించడానికి వైసీపీ కార్యకర్తలని లైన్‌లోకి దించారు.

 

వైసీపీ కార్యకర్తలు ఈ వైరస్‌పై  ప్రజలకు అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు సామాజిక దూరం పాటిస్తూనే, ప్రజలు-ప్రభుత్వానికి వారథిలా పనిచేయాలని కోరారు. తమ తమ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులు ప్రజలకు సరిగా అందుతున్నాయో లేదో చూడాలని, అలాగే మార్కెట్లలో కూరగాయలు, సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. దీంతో పాటు తమ చుట్టూ పక్కల వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆశా వర్కర్లు, వాలంటీర్లకు తెలియజేయాలని కోరారు. మరి చూడాలి వైసీపీ కార్యకర్తలు ఫీల్డ్‌లోకి దిగి, అధిక ధరలకు సరుకులు, కూరగాయలు అమ్మేవారికి ఎలా చెక్ పెడతారో?

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: