తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిన విషయం తెలిసిందే. ఆదాయం భారీగా తగ్గడంతో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేతనాల్లో కేసీఆర్ ఏకంగా 75 శాతం కోత విధించారు. రాష్ట్రంలో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగులకు 60 శాతం కోత విధించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఏకంగా 50 శాతం కోత పెట్టారు. 


 
నిన్న ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించనున్నామని కేసీఆర్ ప్రకటన చేశారు. ఈరోజు జీతాల్లో కోత విధిస్తూ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేసీఆర్ ఔట్ సోర్సింగ్, నాలుగో తరగతి ఉద్యోగుల జీతాల్లో మాత్రం కేవలం 10 శాతం కోత విధించేలా ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం కేసీఆర్ తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సమీక్ష చేశారు. 


 
సమీక్ష అనంతరం ప్రజా ప్రతినిధుల వేతనాల్లో, ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో సీఎం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. భారీ స్థాయిలో జీతాల్లో కోత విధించడంతో ఉద్యోగులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. 
 


ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినా ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 72కు చేరింది. ఈరోజు నమోదైన రెండు కేసులు కరీంనగర్ లోనే నమోదు కావడం గమనార్హం. సీఎం కేసీఆర్ ఎన్ని వేల కోట్లు ఖర్చయినా కరోనాను కట్టడి చేస్తానని గతంలో ప్రకటన చేశారు. చెప్పిన మాట ప్రకారం కేసీఆర్ ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం అన్ని రకాల చర్యలు చేపట్టారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: