కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు.. ఇప్పటికే అనుమానితులుగా గుర్తించిన వారికి చికిత్స అందించేందుకు ఏపీ సర్కారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. సాధారణంగా కరోనా వచ్చిన వారిలో దాదాపు 15 శాతం కేసులను ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందించాల్సి ఉంటుంది. అందుకే.. జిల్లాల వారీగాకూడా ఆస్పత్రులను ఏపీ సర్కారు సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఆసుపత్రుల్లోని సౌకర్యాలను మెరుగుపరుస్తున్నారు.

 

 

విజయనగరంలోని మిమ్స్‌ ఆస్పత్రిలో నాన్‌ ఐసీయూ బెడ్స్‌ పెంచుతున్నారు. ఐసీయూ బెడ్స్‌ను కూడా పెంచుతున్నారు. విశాఖపట్నంలోని గీతం ఆస్పత్రిలో ప్రస్తుతం నాన్‌ ఐసీయూ బెడ్స్‌ 400 బెడ్లను 600కు, ఐసీయూ బెడ్స్‌ను 14 నుంచి 25కు పెంచుతున్నారు. తూర్పు గోదావరిలోని కిమ్స్‌ ఆస్పత్రిలోనూ... పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆశ్రమం ఆస్పత్రిలోనూ బెడ్స్‌ పెంచుతున్నారు. విజయవాడలో పిన్నమనేని ఆస్పత్రిలో 600 నుంచి 800కు, ఐసీయూ బెడ్స్‌ 12 నుంచి 25 పెంచుతున్నారు.

 

 

గుంటూరు ఎన్నారై ఆస్పత్రి, ప్రకాశం జిల్లాలోని కిమ్స్‌ ఆస్పత్రి, నెల్లూరు సింహపురి ఆస్పత్రి, చిత్తూరులోని అపోలో అస్పత్రి, కడపలోని ఫాతిమా ఆస్పత్రి.. కర్నూలు జిల్లాలో శాంతిరాం ఆస్పత్రి... అనంతపురంలో సవేరా ఆస్పత్రిలోనూ నాన్‌ ఐసీయూ బెడ్లు, ఐసీయూ బెడ్లు పెంచుతున్నారు. శ్రీకాకుళంలో జెమ్స్‌లో నాన్‌ ఐసీయూ బెడ్లు 800 పెంచుతున్నారు.

 

 

మొత్తమ్మీద రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆస్పత్రుల్లో బెడ్ల సామర్థ్యాన్ని 8050కి పెంచుతున్నారు. ఐసీయూ బెడ్లను 515కు పెంచుతున్నారు. ఇవి పూర్తిగా కోవిడ్‌ –19 సోకిన వారికి ఆయా జిల్లాల్లో సేవలు అందిస్తాయి. ఈ ఆసుపత్రులను ఆయా జిల్లాల కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షిస్తారు. ఒక్కో ఆస్పత్రికి ఒక్కో ప్రత్యేకాధికారిని నియమిస్తున్నారు. పాజిటివ్‌ కేసు నమోదైతే.. వెంటనే ఈ ఆస్పత్రికి తరలిస్తారు. క్రమంగా కరోనా కేసులు పెరుగు తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా అన్ని జిల్లాల్లోనూ కోవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: