దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. అయితే ఇందులో ఏపీ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. అయినా సరే.. మరింత జాగ్రత్తగా ఉండాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. అకస్మాత్తుగా కేసులు పెరిగినా.. అనుమానిత కేసులు వచ్చినా తగిన విధంగా వైద్యం అందించేలా ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు.

 

 

ప్రతి నియోజకవర్గంలో క్వారంటైన్‌ సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ప్రతి క్వారంటైన్‌ సదుపాయం వద్ద ఒక వైద్య బృందం అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉండి.. ఇళ్లలో ఉండడానికి ఇష్టంలేని వారు నేరుగా క్వారంటైన్‌కు వచ్చి జాయినవ్వొచ్చు. ఇళ్లల్లో సరైన సదుపాయాలు లేనివారికి ఇక్కడ ఐసోలేషన్‌ సదుపాయం కల్పిస్తారు.

 

 

ఇలా జిల్లాల్లో ఇలాంటి వారి కోసం క్వారంటైన్‌ అయ్యేందుకు 16,723 పడకలు ఇప్పటికే ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అంతే కాదు.. ఈ సంఖ్యను మరింతగా పెంచాలని భావిస్తోంది. కనీసం ప్రతి జిల్లాలో కనీసం 5వేల బెడ్లు క్వారంటైన్, ఐసోలేషన్‌కోసం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్న కళ్యాణ మండపాలు, హోటళ్లు, వసతులున్న కాలేజీలు, హాస్టళ్లు.. ఇలాంటి వాటివన్నీ తీసుకుని వాటిని శానిటైజ్‌ చేసి ప్రతి జిల్లాకూ 5వేల బెడ్లు చొప్పున సిద్ధం చేయాలని నిర్ణయించారు.

 

 

కరోనా లక్షణాలు ఉన్నవారని వెంటనే క్వారంటైన్ చేయడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశాలు ఉంటాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు ఇంకా సమాజంలోనే తిరగడం వల్ల వైరస్ వ్యాప్తి మరింత జోరందుకునే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి జిల్లాలోనూ కనీసం 5 వేల బెడ్లు చొప్పున క్వారంటైన్ కోసం సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తాయి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: