దేశ వ్యాప్తం గా లాక్ డౌన్ అమలు లో ఉన్నప్పటి కీ వైద్య, ఆరోగ్య, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బంది, నిత్యావసర వస్తువులు అందించే వారి సేవలు తప్పని సరి. ప్రస్తుతం కరోనా వైరస్ హడలెత్తిస్తున్న నేపథ్యం లో వారు తమ ప్రాణాల కు తెగించి సైతం విధుల్లో పాల్గొంటున్నారు. ప్రలా అవసరాల ను తీర్చడాని కి కార్మికులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు, ఇక వైద్యులు ప్రాణాల కు తెగించి ప్రజల అవసరాల ను తీరుస్తున్నారు. 

 

 

 


నిత్యావసర సరుకులు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇళ్లవద్దకే వెళ్లి వాలంటీర్లు సరుకులను అందజేస్తున్నారు. మన దరిద్రం ఏంటంటే ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించి మరి ప్రజలను కలుసుకోకుండా చేసినా కూడా  పొంచి ఉన్న మహమ్మారి కరోనా ప్రజలను పట్టి పీడించడం మాత్రం మానలేదు అందుకే ప్రజలు అయినా వాళ్లకు సొంతవాళ్లకు దూరంగా ఉండి మరి బ్రతుకుతున్నారు. 

 

 

 


ప్రజల నిత్యావసరాలను దృష్టిలో పెట్టుకొని చాలా సంస్థలు ప్రజలకు సహకరిస్తున్నారు.. అదే కోవలోకి ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ  చేసే డెలివరీ బాయ్ నుంచి సంబంధిత సిబ్బంది కూడా వస్తారు. ఈ విషయమై ఆలోచించిన ఎల్పీజీ పంపిణీ సంస్థలు oil CORPORATION' target='_blank' title='ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూ స్థాన్ పెట్రోలియం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి.

 

 

 

అయితే విధులు నిర్వర్తిస్తున్న గ్యాస్ పంపిణీ చేసే డెలివరీ బాయ్స్, షోరూమ్  సిబ్బంది, గోడౌన్ కీపర్స్, మెకానిక్ లు ఎవరైనా ‘కరోనా’ సంబంధిత లక్షణాలతో ప్రాణాలు కోల్పోతే వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించాయి. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తామని అధికారిక ప్రకటన ద్వారా తెలిపాయి.ఏది ఏమైనా ప్రాణం అందరికి విలువనదే కాబట్టి అందరు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: