అసలే రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు కొన్నాళ్లు గా తగ్గుతున్నాయి.. ఏడాది నుంచి మాంద్యం ప్రభావం స్పష్టంగా కనిపించింది. ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాయే తన బడ్జెట్‌ లో తానే కోత పెట్టుకున్నది. పులి మీద పుట్రలా ఇప్పుడు కరోనా మహమ్మారి విరుచుకుపడింది. ఉన్న కాస్త ఆదాయాలూ రాని పరిస్థితి. అటు కేంద్రం పరిస్థితీ అంతంత మాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాయి.

 

 

అందుకే కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ సర్కారు ధైర్యంగా ఓ అడుగు వేసింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది. ఆల్ ఇండియా సర్వీసు అధికారులకు 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం కోత విధిస్తున్నారు. ఇక నాలుగోతరగతి ప్లస్ ఔట్ సోర్సింగ్ ప్లస్ కాంట్రాక్టు ఉద్యోగులకు 10 శాతం కోత ఉంటుంది. పెన్షనర్లకు కూడా 50 శాతం కోత వేస్తున్నారు. దిగువ కేటగిరీలకు 10 శాతం కోత విధిస్తున్నారు. ఈ కోత నిర్ణయం ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వసాయం పొందే సంస్థల ఉద్యోగులకూ వర్తిస్తుంది.

 

 

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మరీ దారుణం. దీనికితోడు బోలెడు సంక్షేమ పథకాలు.. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి.. ఆర్థిక పరిస్థితి దిక్కుతోచకుండా ఉంది. మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో జగన్ కూడా కేసీఆర్ తరహాలోనే ధైర్యంగా నిర్ణయం తీసుకుంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను టచ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి.

 

 

కోరి కోరి ప్రభుత్వ ఉద్యోగులక వ్యతిరేకంగా ఏ ముఖ్యమంత్రీ అంత సులభంగా నిర్ణయాలు తీసుకోరు. కానీ ఇప్పుడు తీసుకోక తప్పని పరిస్థితి. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణయే జీతాలు కోసేసింది కాబట్టి ఇప్పుడు జగన్ కూడా కేసీఆర్ ను చూపించి తానూ జీతాలు తగ్గిస్తాడా.. లేదా అన్నది చూడాలి. కేసీఆర్ కు ఉన్న వెసులుబాటే జగన్‌కూ ఉంది. 151 ఎమ్మెల్యేల బలం, పార్టీపై అంతులేని పట్టు ఉన్నాయి. మరి జగన్ కూడా అంత ధైర్యం చేసేస్తాడా లేదా అన్నది చూడాలి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: