కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా నుంచి బయలుదేరిన ఈ మహమ్మారి ఇప్పుడు అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ లను వణికిస్తోంది. ఈ దేశాల్లో రోజూ వందల మంది మృత్యువాత పడుతున్నారు. ఈ దేశాల్లో కరోనా రెండో దశ నుంచి మూడో దశకు చేరడమే ఇందుకు కారణంగా చెపుతున్నారు. ఈ దేశాల్లో కరోనా మొదటి దశలో ఉండగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ మారణ హోమం కొనసాగుతోంది.

 

 

ఈ నేపథ్యంలో భారత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే.. ఇండియాలో కరోనా వైరస్‌ ప్రభావం స్థానిక వ్యాప్తి దశలోనే ఉందని కేంద్రం తేల్చి చెప్పింది. కీలకమైన సమూహ వ్యాప్తి దశకు చేరుకోలేదని కేంద్రం చెప్పింది. అంటే.. మూడో దశకు ఇంకా చేరుకోలేదన్నమాట. ఒక వేళ మూడో దశకు చేరుకుంటే దేశం పరిస్థితి అల్లకల్లోలంగా మారుతుంది. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి కరోనా వైరస్ కట్టడి కోసం తగిన చర్యలు తీసుకున్నారు.

 

 

ఒకవేళ ఇండియాలో కరోనా వైరస్ మూడో దశకు చేరుకుంటే.. ఆ విషయాన్ని కేంద్రం తప్పకుండా వెల్లడిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియాతో చెప్పారు. ప్రస్తుతానికి మనం ఆ దశకు చేరుకోలేదని తెలిపారు. మన దేశంలో జనసాంధ్రత ఎక్కువ. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని అనుసరిస్తేనే కరోనాను అరికట్టగలం. వంద శాతం ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజలు పాటించాలి. కేంద్ర రాష్ట్రాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలి. ఏ మాత్రం అనుమానం ఉన్నా కాల్‌ సెంటర్లను సంప్రదించాలని లవ్ అగర్వాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

 

ఇక ఇప్పటి వరకూ దేశంలో 30 మంది వరకూ కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో 92 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. దేశవ్యాప్తంగా 1071 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్‌గా తేలిన 99 మంది కోలుకున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: