జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ప్రశంసలు కురిపించారు. కరోనా వల్ల ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలువుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యం లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కు చెందిన మత్స్యకారులు చెన్నై తీరానికి చేపల వేటకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు. లాక్ డౌన్ ఉండడం తో వారు సొంత ఊరికి చేరుకోలేని పరిస్థితి దాంతో తినడానికి తిండి లేక నానా అవస్థలు పడ్డారు ఈ విషయం పవన్ కళ్యాణ్ ద్రుష్టి కి రావడంతో వెంటనే స్పందించి వారిని ఆదుకోవాలని ట్విట్టర్ ద్వారా తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయాన్నికోరారు. దాంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ,పవన్ విజ్ఞప్తిని సీరియస్ గా తీసుకొని ఆమత్స్యకారులకు ఉండడానికి ఆశ్రయాన్ని అలాగే భోజన వసతిని ఏర్పాటు చేశారు ప్రస్తుతం మత్స్యకారులు క్షేమంగా వున్నారు. స్వయంగా పళనిస్వామే ,పవన్ కళ్యాణ్ కు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 
 
 
ఇక పవన్  చేసిన ఈపనిని తమిళ సై అభినందించారు. పవన్ కళ్యాణ్ గారు చెన్నై హార్బర్ లో చికుక్కుపోయిన శ్రీకాకుళం కు చెందిన మత్య్సకారుల విషయం లో మీ కృషిని అభినందిస్తున్నాను గాడ్ బ్లెస్ యువర్ ఎఫర్ట్స్ అంటూ ఆమె ట్విట్ చేశారు. ఇదిలావుంటే  ఎవరు కష్టాల్లో వున్న వెంటనే స్పందించి  సాయం చేసే  పవన్ కళ్యాణ్ పై నెటిజన్లు సైతం ప్రశసంలు కురిపిస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: