కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదొక్కటే మార్గంగా కనిపిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా అనేకమంది వలస కూలీలు, ఎంతోమంది నిర్భాగ్యులు, రాష్ట్రం కానీ రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. రాష్ట్రాల సరిహద్దుల వద్ద వేలాదిమంది ఎప్పుడు అనుమతిస్తారా, తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోదామా అన్నట్టుగా ఎదురుచూపులు చూస్తున్నారు. వీరికి ఆయా రాష్ట్రాలు సమీపంలో ఉండేందుకు వసతి భోజన సదుపాయాలను కల్పిస్తున్నా కొన్ని చోట్ల వీటిపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేక వీరిని పట్టించుకునే వారు కరువయ్యారు. పెద్ద పెద్ద సమూహాలుగా సరిహద్దుల్లో తమ ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన వీరిపై ఏ మాత్రం అ జాగ్రత్త గా వ్యవహరించినా కరోనా కట్టడికి ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలన్నీ వృధా అయిపోతాయి. 

 

IHG


రెండో దశ నుంచి కరోనా కట్టడిలో మూడోదశ లోకి భారత్ అడుగుపెడుతున్న నేపథ్యంలో, కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ద్వారా వైరస్ విజృంభణకు అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన దేశవ్యాప్తంగా నెలకొంది. విదేశీ మీడియా కూడా వలస కూలీలతో భారత దేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని కథనాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వలస కూలీల వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాలకు పెద్ద సవాల్ గా మారింది. వీరి ఆలనా, పాలనా నెల రెండు నెలలు చూడటం అంత తేలిక ఏమీ కాదు. పోనీ వీరి పరిస్థితి చూసి జాలిపడి లాక్ డౌన్ నిబంధనలు ఏమాత్రం సడలించినా ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. దీని కారణంగా ఎక్కడి వారిని అక్కడే ఉండాలంటూ కేంద్రం అన్ని రాష్ట్రాలకు గట్టి హెచ్చరికలు చేశాయి. 


అంతే కాకుండా అన్ని రాష్ట్రాల సరిహద్దులు మూసివేసి కఠిన నిబంధనలు అమలు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం వీరందరికి భోజన సౌకర్యాలు కల్పించాలని, సొంత గూటికి వెళతామంటే హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం 14 రోజుల క్వారంటైన్ సరిహద్దుల వద్దే ఏర్పాటు చేసి పంపాలని చెబుతుంది. ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. వీరిని ఏమి చేయాలో ఎలా రక్షణ ఇవ్వాలన్న అంశంపై ప్రభుత్వాలు తీవ్ర ఆలోచనలో పడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: