కరోనా మహమ్మారి విలయ తాండవంతో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఇటలీ దేశం అల్లకల్లోలమవుతోంది. అభివృద్ధి చెందిన, ఘనమైన చరిత్ర ఉన్న ఇటలీ దేశం... ఇప్పుడు కరోనా కాటుకు బలవుతోంది. అక్కడ రోజుకు దాదాపు వెయ్యి మంది వరకూ కరోనాతో మృతి చెందుతున్నారు. పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. ఇటలీ మొత్తం జనాభాయే 6 కోట్లు మాత్రమే. అందులోనే ఇప్పటి వరకూ 11 వేల 591 మంది మృతి చెందారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

 

ఇటలీ ఓ అందమైన దేశం.. అత్యాధునిక దేశం. ఆధునిక ఆరోగ్య వసతులు ఉన్న దేశం. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక పరంగా అత్యున్నత స్థాయిలో ఉన్న దేశం. కానీ కరోనాను కట్టడి చేయడంలో మాత్రం దారుణంగా విఫలమైంది. కరోనా పుట్టిన చైనా కంటే అక్కడ పరిస్థితి దారుణంగా తయారైంది. కరోనాను మొదట చాలా తేలిగ్గా తీసుకోవడమే ఇందుకు కారణంగా చెబుతారు. వాస్తవానికి కరోనా దేశంలో అడుగు పెట్టిన మొదట్లోనే ఇటలీ దేశం అప్రమత్తమైంది. తన పౌరులను హెచ్చరించింది.

 

 

అయితే ఇటలీ వాసులు ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన సెలవులను దుర్వినియోగం చేశారు. ఆ సెలవుల్లో బలాదూర్ తిరిగారు. దీంతో కరోనా భయంకరంగా వ్యాపించింది. దీనికి తోడు ఇటలీలో వృద్ధుల జనాభా చాలా ఎక్కువ. కరోనా ఎక్కువగా ప్రభావితం చేసేది వృద్ధులనే అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశం పరిస్థితి దయనీయంగా ఉంది.

 

 

రోజూ కనీసం మూడు, నుంచి నాలుగు వేల మంది పాజిటివ్ గా నిర్థరణ అవుతున్నారు. రోజూ కనీసం 800 మంది మృత్యువాత పడుతున్నారు. ఇటలీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే లక్ష దాటిపోయింది. అక్కడి ప్రభుత్వం చికిత్స అందించలేక చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ప్రఖ్యాత ఇటలీ దేశం ఇప్పుడు శవాల దిబ్బగా మారుతోంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: