కరోనా మహమ్మారికి బలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 7,43,190 మంది ఈ వ్యాధి బారిన పడగా 35,349 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, మొత్తం 183 దేశాల్లో చికిత్స తర్వాత కోలుకుని డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 1,57,069 వరకూ ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. అయితే కోలుకునే వారి సంఖ్య ఎంత ఉందో అంత‌కుమించి క‌రోనా కోర‌లు చాస్తోంది. ఇక ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా అమెరికా క‌రోనా దెబ్బ‌తో భారీగా న‌ష్ట‌పోతోంది. క‌రోనా అక్క‌డ మ‌ర‌ణ మృదంగాన్ని క్రియేట్ చేస్తోంది.

 

నిన్న‌టి విల‌విల‌లాడిన ఇట‌లీని మించిపోయేలా ఇక్క‌డ క‌రోనా విజృంభిస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీలతో కలిపి అమెరికా మొత్తమ్మీద 1.45 లక్షల మంది ఈ వైరస్ భారిన పడ్డారు. మొత్తం 3148 మంది ప్రాణాలు కోల్పోగా 4,574 మంది కోలుకున్నారు. ఇటలీలో కరోనాతో 10,779 మంది మరణించగా లక్ష మంది బాధితులుగా మారారు. కోలుకుని డిశ్చార్జ్‌ అయిన వారు 13,030 మంది ఉన్నారు. ఇక అమెరికాలో అయితే ప‌రిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. 

 

అక్క‌డ లాక్‌డౌన్ అమ‌లు అవుతున్నా కూడా రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు రెచ్చిపోతున్నాయి. ఇప్ప‌టికే అక్క‌డ 3148 మంది చ‌నిపోయారంటేనే ప‌రిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. మ‌రోవైపు క్యూబా లాంటి దేశాలు ప్ర‌పంచంలో అనేక దేశాల‌కు వైద్య బృందాల‌ను పంపుతూ క‌రోనా పై పోరాటం చేసేందుకు కృషి చేస్తున్నా ప‌క్క‌నే ఉన్న అమెరికా మాత్రం క్యూబా వైద్యం త‌మ‌కు వ‌ద్ద‌ని చెప్పేస్తోంది. ఇలాంటి టైంలో కూడా ఈ పంతాలు.. ప‌ట్టింపులు ఎందుక‌న్న‌దే ప్ర‌పంచ మేథావుల ప్ర‌శ్న‌.

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: