చాదస్తం ఉన్న వాళ్లకు ఏమీ చెప్పలేము... అవును చాదస్తం ఉన్న వాడికి చెప్పినా, గొడ్డుకి చెప్పినా ఒకటే. అతను ఏమనుకుంటాడో అదే నిజం, అతని అనుమానం వాస్తవం. పక్కని వాడు ఎం చెప్తున్నాడు...? ఎందుకు చెప్తున్నాడు అనేది కొందరు కనీసం ఆలోచించే ప్రయత్నం చేయరు. ఇప్పుడు అమెరికా ఇదే పరిస్థితిలో ఉంది. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వయసు 70 దాటింది. సాధారణంగా ఆ వయసులో ఉన్న వాళ్లకు చాదస్తం ఎక్కువ. 

 

 

ఈయన గారికి ఆ పాళ్ళు కాస్త ఎక్కువగానే ఉంటాయి. మెక్సికో గోడ కడతా అన్నా, అమెరికా ఫస్ట్ అనే నినాదం ఇచ్చినా, గ్రేట్ గానే ఉన్న అమెరికాను మళ్ళీ మెక్ అమెరిక గ్రేట్ అగైన్ అన్నా సరే అతనికే చెల్లింది. ఇప్పుడు ఆ చాదస్తం తోనే తను చేసిందే నిజం అంటున్నాడు, కరెక్ట్ అంటున్నాడు. అమెరికాలో కరోనా వస్తే అదో జోక్ అన్నాడు. కాని ఇప్పుడు అక్కడ అది చుక్కలు చూపిస్తుంది. అతని వల్ల అసలు ఇప్పుడు దాన్ని కట్టడి చేయడం సాధ్యం కాని పని అనేది వాస్తవం. 

 

 

అమెరికాలో ఇప్పుడు బాధితుల సంఖ్యా రెండు లక్షలకు దగ్గరగా ఉంది. అది మరింతగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అమెరికా ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే బాధితుల సంఖ్య మాత్రం తగ్గే అవకాశం గాని కట్టడి అయ్యే అవకాశం గాని ఎంత మాత్రం లేదు అనేది వాస్తవం. అమెరికాలో ఇప్పుడు కరోనా చేసేది విలయతాండవం. అక్కడి ప్రజల్లో భారీగా వృద్దులు ఉన్నారు. వారు అందరూ కూడా ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అయినా సరే ట్రంప్ మాత్రం లాక్ డౌన్ ప్రకటించడం లేదు, విమానాలను ఆపడం లేదు. ఇవే అక్కడ కరోనా విస్తరించడానికి ప్రధాన కారణాలు గా ఉన్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: