తెలంగాణాలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపధ్యం లో అక్కడి ప్రభుత్వం ఇప్పుడు చాలా వరకు అప్రమత్తంగానే వ్యవహరిస్తుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ కేసీఆర్ ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించడం లేదు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ అధికారులకు ఒక్కొక్కరికి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తుంది తెలంగాణా ప్రభుత్వం. ఇప్పుడు అక్కడ వైరస్ విస్తరించే అవకాశాలు ఉన్నాయి. 

 

దీనితో కేసీఆర్ సర్కార్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. వైద్య విద్యార్ధుల సహాయం తో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. గ్రామ స్థాయి లో కరోనా పరిక్షలు నిర్వహించాలని భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేక వైద్య సిబ్బందిని గ్రామాలకు పంపే యోచన లో ఉంది తెలంగాణా ప్రభుత్వం. అందుకోసం వైద్య విద్యార్ధుల సహాయం తీసుకునే యోచనలో ఉన్నారు. తెలంగాణాలో కరోనా బాధితుల సంఖ్య 72 గా ఉంది ప్రస్తుతం. 

 

అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. వారు ఇండోనేషియా బృందంతో కలిసారు. ఆ బృందంతో కలిసిన వాళ్ళల్లో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. తెలంగాణాలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. దీనితో తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు అప్రమత్తంగానే వ్యవహరిస్తుంది. చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటుంది తెలంగాణా సర్కార్. గ్రామాలకు వైద్య బృందాలను పంపే యోచనలో తెలంగాణా సర్కార్ ఉంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సాయం కూడా తీసుకునే యోచనలో కెసిఆర్ ఉన్నట్టు సమాచారం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: