రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్... వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎక్కడిక్కడ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. విశాఖలో కూడా కరోనా వైరస్ సోకినా వాళ్ళు బయటపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే జగన్ సర్కార్ ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. 

 

విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు పూర్తిగా రవాణా సౌకర్యాలను ఆపేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే విశాఖ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాలకు కూడా రవాణా సౌకర్యాలను పూర్తి స్థాయిలో ఆపాలని భావిస్తున్నారు. అక్కడి అధికారులను అక్కడే ఉంచాలని, అక్కడి నిత్యావసర సరుకులు అక్కడే వాడాలని, అవసరమైతే రెండు రోజుల సమయం తీసుకుని వెంటనే నిత్యావసర సరుకులను పూర్తి స్థాయిలో తరలించాలని భావిస్తుంది. 

 

ఈ మేరకు ఇప్పటికే జగన్ ఉన్నత అధికారులతో సమావేశం కూడా నిర్వహించి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి వాళ్ళు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. కానూరు వరకు మాత్రమే బయటి ప్రాంతాల వారిని అనుమతించాలని, అక్కడి కి మించి లోపలికి ఎవరిని రానీయవద్దు అని అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. అలాగే గుంటూరు సరిహద్దులు, విశాఖ సరిహద్దుల వరకు మాత్రమే జనాలను అనుమతించాలని అంతకు మించి ఎవరిని కూడా ఏ అవసరం ఉన్నా సరే లోపలి రానీయకుండా చూడాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయం త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: