క‌రోనా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ళ‌యం సృష్టిస్తోంది. క‌రోనా పురి విప్పుతోంది.. ప్ర‌ళ‌య క‌రోనా ఇలాంటి ఎన్ని తీవ్ర‌మైన ప‌దాలు వాడినా కూడా క‌రోనా గురించి జ‌రుగుతోన్న న‌ష్టం త‌క్కువే అని చెప్పాలి. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారికి బలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. అటు మృతుల సంఖ్య గంట గంట‌కు చూస్తుంటే క‌ళ్లు తిరుగుతున్నాయి. అస‌లు ఈ ప్ర‌పంచం వినాశ‌నం వైపు ప‌య‌నిస్తోందా ?  లేదా ?  అంత వైపు వెళుతోందా ? అన్న‌ది అర్థం కాని ప‌రిస్థితి.

 

సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 7,43,190 మంది ఈ వ్యాధి బారిన పడగా 35,349 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు ఉన్న అప్‌డేట్స్ ప‌రిశీలిస్తే 7, 85, 812 మంది క‌రోనా పాజిటివ్‌కు గుర‌య్యారు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా ఇదే స‌మ‌యానికి 37, 814 మంది మృతి చెందారు. 1, 65, 606 కేసులు రిక‌వ‌రీ అయ్యాయి. అమెరికా , జ‌ర్మ‌నీ, స్పెయిన్‌, ఇట‌లీ, చైనా లాంటి దేశాలు ఇప్ప‌టికే విల‌విల్లాడుతున్నాయి. చైనా మాత్ర‌మే శ‌ర‌వేగంగా రిక‌వ‌రీ అయ్యింది.

 

ఇక మిగిలిన దేశాల్లో ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తే అవి ఎప్ప‌ట‌కి కోలుకుంటాయో ? అస‌లు అక్క‌డ క‌రోనా ఎప్ప‌ట‌కి ఆగుతుందో ?  కూడా తెలియ‌డం లేదు. అమెరికాలో కేసులు 2 ల‌క్ష‌ల‌కు చేరువ అవుతుంటే న్యూయార్క్‌లోనే ఏకంగా 67 వేల‌కు చేరువ అవుతున్నాయి. న్యూ జెర్సీలో కేసులు సైతం 17 వేల‌కు ద‌గ్గ‌ర్లో ఉన్నాయి. ఇక సోమ‌వారం ఒక్క రోజే ఏకంగా 3751 మంది మృతి చెందారు. రోజుకు స‌గ‌టున 4 వేల మంది అంటే ప‌రిస్థితి కంట్రోల్ లోకి వ‌స్తుందా ?  లేదా ఇది మ‌రింత తీవ్రం అవుతుందా ? అన్న భ‌యంక‌ర ఆలోచ‌న‌లతో ఇప్పుడు అంద‌రూ న‌ర‌కం అనుభ‌విస్తున్నారు.

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: