ప్రపంచంలో కరోనాకు భయపడని వారున్నారా అనే ప్రశ్న ప్రతి వారిలో కలిగే ఉంటుంది.. అయితే కొందరు కరోనా వస్తే చచ్చిపోతాం అంతేగా అని తేలిగ్గా తీసుకుని విచ్చలవిడిగా తిరుగుతున్నారు.. ఇలాంటి వారిని మొండివాళ్లూ అంటారు.. ఇకపోతే కరోనాకు భయపడని మరో వర్గం ఉంది.. వాళ్లనే దొంగలు అంటారు.. ఈ కరోనా దెబ్బకు వైరస్ సోకినవాళ్లు చస్తామో బ్రతుకుతామో తెలియని పరిస్దితుల్లో అల్లాడుతుంటే.. వీళ్లు మాత్రం కరోనాకు భయపడకుండా దొంగతనాలు చేస్తున్నారు.. అది కరోనా వచ్చిన వారి ఇంటిలో.. ఇలాంటి వారి దగ్గరికి పోలీసులు, వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్లరు.. అలాంటిది. ఈ దొంగలు మాత్రం యదేచ్చగా వారింటికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు.. ఏకంగా కరోనా పాజిటివ్ వచ్చి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి ఇళ్లనే టార్గెట్ చేశారు.

 

 

కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వ్యక్తి కుటుంబ సభ్యులను, అతను కలిసిన వ్యక్తులను కూడా క్వారంటైన్‌కి పంపించడం వారికి బాగా కలిసొచ్చింది. ఇంట్లో ఎవరూ లేరని పక్కాగా తెలియడంతో తాపీగా వచ్చి సైలెంట్‌గా పని పూర్తి చేసుకెళ్లారు. ఈ ఆశ్చర్యకర ఘటన జమ్మూ కశ్మీర్‌లో చోటుచేసుకుంది. ఉత్తర కశ్మీర్‌లోని బందిపొరా జిల్లా హజిన్ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ అని తేలింది. వారిని శ్రీనగర్‌లోని స్కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయన్ని పసిగట్టిన దొంగలు ఇదే అదనుగా భావించి కిటికీలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాల సహా విలువైన వస్తువులను దోచుకున్నట్లు సమాచారం...

 

 

మరుసటి రోజు ఉదయం వీరి ఇంటి పరిసరాల్లో ఇంట్లోని కొన్ని వస్తువులు పడి ఉండటం చూసిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. దొంగలను గుర్తించేందుకు ఫోరెన్సిక్, మెడికల్ టీమ్‌లను రప్పించారు. కాగా ఇది ఇంటి దొంగల పని అయినా లేదా, తెలిసిన వారి పనిగా వారు అనుమానించి ఆ దిశగా విచారణ చేపట్టారు...

మరింత సమాచారం తెలుసుకోండి: