ప్రపంచ మంతటా కరోనా వైరస్ కారణంగా ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మన దేశం వారు చదువు కోసం, ఉద్యోగాల కోసం, విదేశాలకు వెళ్లారు. విదేశాలలో ఉన్న స్వదేశీయులో కొందరు ఇండియాకు రాగా మరి కొందరు అక్కడే చిక్కుకున్నారు. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ కూడా కరోనా బారిన పడి స్వీయ నిర్బంధనలో ఉన్నారు. అక్కడ పరిస్థితి రోజురోజుకు పెరుగుతూ ఉండటం వలన బ్రిటన్ వాసులను భయానికి గురి చేస్తుంది 


ఇలాంటి పరిస్థితిలో ఇళ్ల నుండి బయటకు వెళ్లడమే అత్యంత ప్రమాదంగా మారింది. అక్కడ ఉండే స్థానిక ప్రజల గతి అలా ఉందంటే అక్కడికి చదువు కోవడానికి వెళ్లిన మన తెలుగు విద్యార్థుల పరిస్థితి ఎంత అద్వానంగా మరి ఉంటాదో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశంలో లాగే బ్రిటన్ లో కూడా లాక్ డౌన్ విధించారు. విషయం తెలుసుకున్న కొందరు ముందు చూపుతో నిత్యావసర వస్తువులను తెచ్చుకున్నారు. 

 

అయితే బ్రిటన్ లో లాక్ డౌన్ చాలా కఠినంగా నిర్వహిస్తున్నారు. మరి కొంత మంది ఇంట్లో ఉన్న వస్తువులను వాడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కనీసం పాలు, నీళ్లకు కూడా బయటకు వెళ్లేందుకు వారు అనుమతి ఇవ్వడంలేదు. అయితే అక్కడ లాక్ డౌన్ విధించడం వలన నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. దింతో వారికీ తినడానికి ఏమి దొరకా వాట్సప్ లోఅడుగుతూ బ్రతుకుతున్నాం అన్నారు.

 

అయితే ఇందులో ఇంకా విషాదకరమైన ఘటన ఏంటి అంటే వారి చేతిలో డబ్బులు లేవు. ప్రస్తుతం వారి దగ్గర ఉన్న డబ్బులతో ఒక్క పదిహేను రోజుల కంటే ఎక్కువగా జీవనం సాగించలేరు.  అయితే వారిలాగా అక్కడ చిక్కుకున్న తెలుగు వారు అంత కలిసి మొత్తం ఒక్క 150మంది దాక ఉన్నారు. వారందరితో కలిసి ఒక్క వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ అధికారులు స్పందించి వారిని స్వదేశాలకు ఎలాగైనా తీసుకెళ్లండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: