కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఏ స్ధాయిలో వణికించేస్తోందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రపంచం మొత్తం మీద వరస్ట్ ఎఫెక్టెడ్ దేశాలంటే ముందుగా ఇటలీ, స్పెయిన్, అమెరికా, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, ఇరాన్ లనే చెప్పుకోవాలి. మొత్తం మీద 7.5 లక్షల మంది వైరస్ బాధితులుంటే 38 వేలమంది చనిపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బాధితుల్లో కానీ చనిపోయిన వారిలో కానీ యూరోప్ దేశాల్లోనే చాలా ఎక్కువగా ఉన్నారు.

 

యూరోప్ దేశాల్లో కూడా ఇటలీ, స్పెయిన్ దేశాల గురించే ప్రధానంగా చెప్పుకోవాలి. ఇటలీలో బాధితుల సంగతిని పక్కన పెట్టేసినా 11 వేలమంది చనిపోయారు. అలాగే స్పెయిన విషయం తీసుకుంటే 7340 మంది మరణించారు. అంటే చనిపోయిన మొత్తం 38 వేలమందిలో పై రెండు దేశాల్లోనే 18 వేలమంది ఉండటం సంచలనంగా మారింది. పై రెండు దేశాల్లో ప్రతిరోజు కొన్ని వందలమంది చనిపోతున్నారు. గట్టిగా చెప్పాలంటే స్పెయిన్ దేశంలో గంటకు 35 మంది మృత్యువాత పడుతున్నారు.

 

పై రెండు దేశాల్లోనే బాధితులు, మరణాలు ఎందుకు ఎక్కువున్నాయంటే రోగులకు తగ్గట్లుగా ఆసుపత్రులు, వైద్య సిబ్బంది లేకపోవటమే ప్రధాన కారణం. మొత్తం బాధితుల్లో ఐరోపాలోనే 4 లక్షల మంది ఉంటే ఇందులో మళ్ళీ 13 వేలమంది వైద్య సిబ్బందే ఉన్నారు. అంటే రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకుని వైద్యం అందించే పరిస్దితులు కూడా లేవక్కడ. ఏ దేశంలో ఆసుపత్రులైనా ఎప్పుడైనా అత్యవసరమైనపుడు ఏ పదిమందినో లేకపోతే 20 మందినో ఒకేసారి చేర్చుకుని చికిత్సలు అందించే స్ధితిలోనే ఉంటాయి. అంతేకానీ ఒకేసారి వందల మంది రోగులు వచ్చేస్తుంటే చేర్చుకుని వైద్యం అందించే శక్తి ఏ ఆసుపత్రులకీ లేదు.

 

బాధిత దేశాల్లో ఇపుడు జరుగుతున్నది అదే. రోజుకు వందలమంది రోగులు ఆసుపత్రులకు వచ్చేస్తుంటే వారికి చికిత్సలు అందించలేక ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి. దాంతో మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందుకనే బతికే అవకాశం ఉన్న వాళ్ళని తప్ప మిగిలిన వాళ్ళని ఆసుపత్రులు చేర్చుకోవటం లేదు. అందుకే మరణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటోంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: