ఈ మ‌ధ్య కాలంలో వివాహేత‌ర సంబంధాలు ఎక్కువ‌యిపోయాయి. సంసారం భ‌ర్త, పిల్ల‌లు ఇవేమి ఈ రోజుల్లో ప‌ట్టించుకోవ‌డం లేదు. దానికి తోడు వివాహ బంధానికి అస‌లు విలువ లేకుండా చేస్తున్నారు మ‌రికొంత మంది. భ‌ర్త పిల్ల‌ల క‌న్నా వివాహేత‌ర సంబంధాల‌కే ఎక్కువ ప్రాధాన్య‌తనిస్తూ దాని కోసం ఏమి చెయ్య‌డానికైనా వెన‌కాడ‌డం లేదు. ఎంతటి అఘాంత‌ల‌కైనా పాల్ప‌డుతున్నారు. మ‌రి ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది.

 

మ‌దురైలో ఉన్న ఓ వ్య‌క్తికి అదే ప్రాంతానికి చెందిన మ‌హిళ‌తో ప‌దిహేనేళ్ళ క్రితం వివాహం జ‌రిగింది. ఎంతో ఆనందంగా సంసార జీవితం సాగిస్తున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా పుట్టారు. అనుకోకుండా అదే గ్రామానికి చెందిన మ‌రో వ్య‌క్తితో ఈ మ‌హిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త కళ్లుగప్పి కొన్నాళ్లపాటు గుట్టుగా  వీరి వ్య‌వ‌హారాన్ని సాగించింది. అనుకోకుండా ఓ రోజు కుటుంబ స‌భ్యుల‌కు ఈ విష‌యం తెలియ‌డంతో ఇంట్లో వారంద‌రూ క‌లిసి ఆమెను మంద‌లించి మంచి చెడులు చెప్పారు. అయినా కూడా ఆమె వ్య‌వ‌హారాన్ని మార్చుకోలేదు. అంతేకాక భ‌ర్త పిల్ల‌ల‌క‌న్నా ప్రియుడే ముఖ్య‌మ‌ని అత‌నితో క‌లిసి వెళ్ళిపోయింది. పదేళ్లుగా ఎవరి కంట పడకుండా సహజీవనం చేస్తోంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిర్వహిస్తున్న లాక్‌డౌన్ సందర్భంగా సొంతూరికి ప్రియుడితో కలిసి తిరిగొచ్చింది. ఇక  ఆమెను చూసిన కుటుంబ సభ్యులు ఆవేశం ఆపుకోలేక ఇద్దరినీ విచక్షణా రహితంగా కొట్టడంతో మహిళ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. 

 

 తన సుఖానికి అందరూ అడ్డొస్తున్నారని భావించిన ఆమె ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. వారు పదేళ్లుగా తిరుప్పూరులో సహజీవనం చేస్తున్నారు.
అయితే లాక్‌డౌన్ సందర్భంగా వారిద్దరు ఆదివారం సొంతూరికి తిరిగి వ‌చ్చారు. ఇక ఆదివారం మహిళ కుటుంబసభ్యులు కత్తులతో దాడి చేశావంటూ . ప్రియుడితో వెళ్లిపోయి కుటుంబ పరువు తీశావంటూ బంధువులు ఆమె పై విచ‌క్ష‌ణా ర‌హితంగా ప్ర‌వ‌ర్తించారు. వారిని అడ్డుకునేందుకు  మ‌ధ్య‌లో వచ్చిన ప్రియుడిపైనా దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడిలో మహిళ అక్కడికక్కడే చనిపోగా... ప్రియుడు మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: