ప్రపంచం మొత్తం కరోనా భయంతో అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇక దేశానికే రోల్ మోడల్‌గా జనరంజక పాలన అందిస్తూనే కరోనా లాంటి భయంకరమైన పరిస్థితులను తనదైన శైలి, వ్యూహాలతో ముఖ్యమంత్రి  కేసీఆర్ అధిగమించడాన్ని దేశమంతా ఆసక్తిగా పరిశీలిస్తున్నది. రాష్ట్రంలో 21 రోజుల లాక్‌డౌన్ ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేస్తున్నా తనకు ఆర్థికం కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని ముఖ్యమంత్రి ఈ విషయంలో నిరూపించారు.

 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతి క్షణం సమీక్షలు నిర్వహిస్తూ ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నారు.. వారి ఇబ్బందులను ఎలా తీర్చాలన్న విషయంపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు.  ప్రజలు, పార్టీ, అధికార యంత్రాంగాన్ని ఒకవైపు కన్నతల్లి తన పిల్లలపై ఎలాంటి ప్రేమను కురిపిస్తుందో, లాలిస్తుం దో అలా చేస్తూనే మరోవైపు వారిని నియంత్రణలోకి తీసుకు రావడానికి తండ్రి ఎలా కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉంటా రో అలా కెసిఆర్ వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని కరోనా నుంచి విముక్తి చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  దేశమంతా లక్షల్లో వలస జీవులు రివర్స్ వలసల బాటలో ఉండగా వాళ్లంతా స్వరాష్ట్రాలకు వెళ్లకుండా ఉండడానికి వారికి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

 

కెసిఆర్ ‘ట్రూ లీడర్’, ‘ట్రూ స్టేట్స్ మన్’, ‘వెల్‌డన్ చీఫ్ మినిస్టర్’ అంటూ బాలీవుడ్ నటుడు సోనూసూ ద్,   స్మితా ప్రకాశ్, అగస్త కంటూలు ప్రశంసిస్తూ... సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేశంలో కరోనా విశ్వరూపం దాలుస్తూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నా రాష్ట్రంలో మాత్రం కరోనా ప్రభావాన్ని కనీసంగా తగ్గించడంలో ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు రచిస్తూ ప్రజల్లో కొండంత ధైర్యాన్ని నింపుతున్నారు కేసీఆర్.  ఇప్పటి వరకు 70కు పైగా పాజిటివ్ కేసులు నమోదైనా మరణాలు మాత్రం అధికారికంగా ఒకటికి మించలేదు. అలాగే 25 వేల మందికి పైగా వ్యక్తులు వివిధ రకాల స్వీయ నిర్బంధంలో ఉన్నా వారిని కరోనా బారిన పడకుండా వైద్య ఆరోగ్యశాఖ విజయవంతమైన సేవలు అందించడంలో కెసిఆర్ దిశానిర్దేశం అసాధారణమైనది.  

మరింత సమాచారం తెలుసుకోండి: