ప్రపంచ దేశాలను కబళిస్తూ ఎంతోమందిని ప్రాణభయంతో వణికిస్తూ ఇంకెంతో మందిని మృత్యువు  ఒడిలోకి నెడుతుంది మహమ్మారి ప్రాణాంతకమైన వైరస్. చైనాలో గుర్తించబడిన ఈ మహమ్మారి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తిచెందుతుంది . ప్రపంచదేశాలన్నీ ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ వైరస్ వ్యాప్తి మాత్రం శర వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ భయాందోళన మధ్య బతుకును వెళ్లదీస్తున్నారు. ఎక్కడ కరోనా  వైరస్ తమ వరకు వస్తుందో అనే ప్రాణభయంతో నే బతుకుతున్నారు ప్రజలు. ముఖ్యంగా కరోనా  వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. 

 

 

 ఈ నేపథ్యంలో చాలా మంది... ఇతర ఇతర దేశాల్లో ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భారతదేశానికి చెందిన చాలా మంది ఇతర దేశాల్లో చిక్కుకుపోయి ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి విషయం తెలిసిందే. అయితే న్యూయార్క్ లో  ఒక తెలుగు యువకుడికి కరోనా  వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా ప్రస్తుతం అతడు ప్రాణాంతకమైన కరోనా  వైరస్ నుంచి పూర్తిగా కోరుకున్నాడు. ప్రస్తుతం అతని నివాసం లో విశ్రాంతి తీసుకుంటున్న సదరు వ్యక్తి కరోనా  వైరస్ సోకిన సమయంలో తన అనుభవాలను పంచుకున్నారు.  నాటా ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ అవేర్నెస్ లో తన అనుభవాలను వివరించారు. 

 

 

 ఇదిలా ఉంటే... కాలిఫోర్నియాలో ఒక తెలుగు వృద్ధ మహిళలకు కూడా కరోనా  వైరస్ సోకి మరణించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా న్యూయార్క్  పరిసరాల్లో నివసిస్తున్నా తెలుగు వైద్య దంపతులకు కూడా ఈ మహమ్మారి వైరస్ సోకింది. అయితే వారు ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినుంచి చికిత్స పొందుతూ బయటపడ్డారు. ప్రస్తుతం పూర్తిగా కోరుకున్నట్టు వెల్లడైంది. అంతే కాకుండా విదేశాల్లో ఉన్న ఎంతోమంది భారతీయులు కూడా  ఈ మహమ్మారి వైరస్ భారిన పడుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: