దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. తాజాగా అండమాన్ లో కరోనా వైరస్ కు సంబంధించిన 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న తబ్లిగి జమాత్ కేంద్రం (మర్కజ్)లో నిర్వహించిన మతపరమై కార్యక్రమానికి వెళ్లివచ్చిన వారిలో కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. మర్కజ్ వెళ్లి వచ్చిన 9 మంది అండమాన్‌ వాసుల్లోనూ కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అండమాన్‌లో మొత్తం కేసుల సంఖ్య 10కి చేరుకుంది. వీరంతా వేర్వేరు విమానాల్లో ఢిల్లీ నుంచి ఈ నెల 24న అండమాన్ చేరుకున్నారు.

 

కాగా మర్కజ్ మౌలానాపై కేజ్రీవాల్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 34 మందిని తబ్లిగి జమాత్ కేంద్రం నుండి ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకువచ్చారు. వీరందరికీ  కరోనా ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు భయానక కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడాన్ని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పరిస్థితులు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో చోటు చేసుకున్న మత ప్రార్థనలు పిడుగుపాటులా మారాయనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. 

 

అండమాన్, నికోబార్ దీవులకు బయటి వ్యక్తులెవరూ రాకుండా నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. కరోనా పాజిటివ్ గుర్తించిన వారికి  ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  ఇతర ప్రాంతాల నుంచి దీవులకు తిరిగొచ్చిన ప్రతి ఒక్కరికీ 14 రోజుల క్వారంటైన్ అమలు చేశామ‌ని తెలిపారు అక్క‌డి అధికారులు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: