భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం  పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా  వైరస్ బారిన పడిన వారి సంఖ్య వెయ్యి దాటిపోయింది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న .. ఎన్నో కఠినతరమైన నిబంధనలను  అమల్లోకి తెచ్చినప్పటికీ కరోనా  వైరస్ నియంత్రణ మాత్రం సాధ్యపడడం లేదు. రోజురోజుకు మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. అయితే అవగాహన లేమి వల్లే ఇదంతా జరుగుతుందని వైద్యులు చెబుతున్నప్పటికీ... ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో అప్రమత్తంగా లేనట్లు తెలుస్తోంది. 

 

 

 ఈ క్రమంలో రోజురోజుకు భారత్లో కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగి పోతోంది. ఇప్పటికీ దేశంలో  లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ దేశంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య మాత్రం పెరిగిపోతూనే ఉంది. ప్రజల నిర్లక్ష్యం... ప్రభుత్వ నిబంధనలు పాటించక పోవడం వెరసి... ఎంతో మంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడాల్సి వస్తుంది. భారత్ లో  ఇప్పటికే 1300 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ మహమ్మారి ప్రాణాంతకమైన వైరస్ కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా దేశంలోని కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాలలో అత్యధికంగా కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 

 

 

 అయితే కరోనా  వైరస్ పై పోరాటంలో భాగంగా  తాజాగా మహారాష్ట్ర అధికారులు ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన రోగుల మృతదేహాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు... కరోనా  వైరస్ కట్టడికి నిర్ణయించారు. కరోనా  వైరస్ సంక్రమణ తో మరణించిన వారి మతం ఏదైనప్పటికీ... వారి మృతదేహాలను దహనం చేస్తాము అంటూ... బీఎంసీ చీప్ ప్రవీణ్ పార్దేశి  వెల్లడించారు. కరోనా  వైరస్ బారిన పడిన వారి మృతదేహాల అంత్యక్రియలకు ఐదు మందికి మించి హాజరు కాకూడదు అంటూ తెలిపారు. కాగా మహారాష్ట్రలో ఇప్పటికే 220 కరోనా  పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ వైరస్ బారినపడి రాష్ట్రంలో ఏకంగా పది మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: