కరోనా వైరస్ కారణంగా రోజు రోజుకు మరణాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 37వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. ఇంకా 7లక్షలమందికిపైగా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య పెరిగింది. ఇంకా ఈ వైరస్ భారత్ లోకి ప్రవేశించడంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం మొదటి వారమే ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంది. 

 

21 రోజులు పాటు ఎవరు బయటకు రాకూడదు అని.. ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం కావాలి అని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీ వరుకు లాక్ డౌన్ విధించింది. ఇంకా ఈ నేపథ్యంలోనే 70 శాతం ప్రజలు ఇళ్లకు పరిమితం అయ్యారు.. మిగితావారు అంత ఆ పని ఈ పని అని తిరుగుతూనే ఉన్నారు. ఇంకా ఇది అంత పక్కన పెడితే.. 

 

ఈ లాక్ డౌన్ వల్ల మందుబాబులు బాగా హర్ట్ అయ్యారు.. చెప్పాలంటే ఎన్నో కష్టాలు పడ్డారు.. కొందరు అయితే మద్యం లేదని ఏకంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. కేరళ రాష్ట్రంలో అయితే మధ్య దొరికాక రోజు రోజుకు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఆత్మహత్యలను దృష్టిలో ఉంచుకొని డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ ఉన్న వారికే మద్యం లభించేలా నిర్ణయం తీసుకున్నారు. 

 

అంతేకాదు.. డాక్టర్ల నుంచి ప్రిస్క్రిప్షన్‌ ఉన్నవారికి మద్యంను అందుబాటులోకి తీసుకురావాలని ఎక్సైజ్‌ విభాగాన్ని ఆదేశించినట్టు కేరళ సీఎం పినరయి విజయన్‌ తెలిపారు. అలాగే ప్రజలను డీ అడిక్షన్‌ కేంద్రాల్లో చేర్పించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏది ఏమైనా మద్యానికి ఎంతమంది బానిస అయ్యారో చుడండి.. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: