సోవియట్ యూనియన్ దేశాలు కరోనా వైరస్ కి ఏమాత్రం భయపడడం లేదు. అసలు కరోనా వైరస్ అనేది ఒకటి ఉందని కూడా వాళ్లు పట్టించుకోవట్లేదు. అరె బాబు, కరోనా ప్రాణాంతక వైరస్, సోకితే చనిపోవడమే...జాగ్రత్తగా ఉండండి, రా! అని ప్రపంచ దేశాల అధినేతలు తమ ప్రజలకు చెబుతుంటే... సోవియట్ యూనియన్ దేశాలు మాత్రం మందేసి చిందేస్తే మీకు ఏ వైరస్ రాదంటూ ఎటువంటి లాక్ డౌన్ ప్రకటించడం లేదు.


ముఖ్యంగా రష్యా, పోలాండ్ మధ్య ఉండే బెలారస్‌ అధ్యక్షుడు చేసే వాక్యాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు లుకాషెంకో ఏమంటున్నారంటే... హాకీ ఆట ఆడి, హాయిగా వోడ్కా తాగి, బన్యా (ఒక సంప్రదాయ ఆవిరితో చేసే స్నానం)  చేయండంటూ హితవు పలికారు. అలాగే బార్లు, రెస్టారెంట్లు అన్ని తెరిచే ఉంటాయని... ఎవరైనా యథేచ్ఛగా మందు తాగి చిందేయొచ్చని అలా అయితేనే కరోనా వైరస్ ఎవరికీ సోకదని చెప్పుకొచ్చారు. అక్కడ నిర్వహించే ఆటల పోటీలకు కూడా వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ భౌతిక దూరం( సోషల్ డిస్టెన్స్) పాటించమని చెబితే... అది తప్ప అన్నీ చేస్తున్నారు ఈ బెలారస్‌ దేశస్తులు.


బెలారస్‌ అధ్యక్షుడు మాట్లాడుతూ... లాక్ డాన్ కారణంగా ఉపాధి లేక ఉద్యోగాలు పోయి నిరుద్యోగం పెరిగి వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకి ప్రేరణ అని చెప్పాడు. మొత్తం కలిపి 90 లక్షల జనాభా ఉండే ఈ దేశంలో ఫుట్బాల్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం జరుగుతోంది. మరోవైపు అధ్యక్షుడు లుకాషెంకో తాజాగా హాకీ కూడా ఆడాడు. కరోనా కి తలవంచడం కంటే చచ్చిపోవడమే మంచిదని తాను చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బెలారస్‌లో మే 9న విక్టరీ డే జరుపుకుంటారు. అయితే ఆ రోజు వరకు వోడ్కా మందు విచ్చలవిడిగా దొరుకుతుందని లుకాషెంకో చెప్పారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: