ఏపీలోని మంగ‌ళ‌వారం క‌రోనా విజృంభించింది. మంగ‌ళ‌వారం ఒక్క రోజ ఏకంగా 17 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా న‌మోదు అయ్యాయి. వీరిలో ప్ర‌కాశం జిల్లా నుంచే 8 మందికి ఈ రోజు పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ ఒక్క రోజు ఇన్ని కేసులు బ‌య‌ట ప‌డ‌డంతో ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి తీవ్ర ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక ఈ రోజు కేసులు చూస్తే ప్ర‌కాశం జిల్లాలో 8 కేసులు.. అనంత‌పురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో ఒక కేసు న‌మోదు అయ్యాయి. అలాగే తూర్పు గోదావ‌రి జిల్లాలో కూడా ఒక కేసు న‌మోదు అయ్యింది. 

 

వీరంతా కూడా ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మ‌త ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి వ‌చ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో పోలీసుల‌తో పాటు అధికార యంత్రాంగం తీవ్ర అప్ర‌మ‌త్త‌త‌కు లోనైంది. అసుల ఎవ‌రెవ‌రు ఢిల్లీ వెళ్లి వ‌చ్చారు ?  వీరిలో ఎవ‌రెవ‌రిని బంధువులు క‌లిశార అన్న‌దానిపై ఆరా తీస్తున్నారు. ఏదేమైనా ఏపీలోనూ ఊహించ‌ని విధంగా క‌రోనా దూసుకు వ‌స్తుండ‌డంతో ఇప్పుడు అంద‌రిలోనూ ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రోవైపు ప్ర‌భుత్వం సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆసుప‌త్రుల‌ను సైతం క‌రోనా ఐసోలేష‌న్‌కు ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: