కరోనా తో ఆర్ధిక వ్యవస్థ పడిపోయింది. కరోనా వైరస్ తో ప్రపంచం అల్లకల్లోలం అయిపోతోంది. ఎక్కడ చుసినా కూడా కరోనా హింసిస్తూనే ఉంది. అనేక బాధలతో ప్రజలు ఇళ్లల్లోనే ఉన్నారు. ఎంతో మంది జనం కూడా ఆసుపత్రి పాలయ్యారు. ప్రపంచంలో అనేక మందిని కరోనా మింగేసింది. ఇప్పటికే ఈ కరోనా మృతుల సంఖ్య  కూడా భారీగా పెరుగుతూనే వచ్చింది.

 

 

అలానే ఆసుపత్రిలో ఉన్న వారికి కూడా వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. మొత్తం మన దేశం అంతా కూడా లాక్ డౌన్ ని పాటిస్తూ ఇళ్లల్లోనే ఉంటూ మోడీ సర్కారు చెప్పిన వాటిని పాటిస్తున్నారు. కరోనాని  కట్టడి చెయ్యాలని కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. 

 

అయితే ప్రపంచం అంతా కూడా నేలమట్టం అయింది ఈ వైరస్ వల్ల. చైనా ఆర్ధిక వ్యవస్థ ఒక్కసారే నిలిచి పోయింది. అలానే ఆసియా దేశాలు కూడా పేదరికం లోకి కూరుకున్నాయి. అలానే లాక్ డౌన్ వల్ల కూడా తీవ్ర నష్టం వచ్చింది. ఆర్ధిక వ్యవస్థ మాత్రం ఇప్పుడిప్పుడే పుంజుకోలేదు అని ఆదిత్య మట్టూ స్పష్టం చేసారు. 6 .1 చైనా ఆర్ధిక వృద్ధి 2.3 కి జారిపోయిన దుస్థితి.

 

 

అయితే దీనికి అంతటికీ కారణం కరోనా వైరస్. అలానే రవాణా నిలిపి వేయడం వల్ల స్థితి మరీ ఘోరం. ఇవన్నీ ఇలా ఉంటే రెండు నెలల క్రితమే చైనా ఈ ఏడాది 5.9 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంకు కూడా అంచనా వేసింది. ఉత్పత్తి రంగం నుండి అన్ని రంగాలు కూడా గత 30 సంవత్సరాలుగా లేని విధంగా ఫిబ్రవరి నెలలో పడిపోవడం తీవ్ర దుస్థితే. ఎక్కువ వైరస్ ప్రవాహావం వాణిజ్యం,  పర్యాటక, కమొడిటీస్ రంగాలపై పడుతుంది అని చెప్పారు. 

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
 
 
 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: