ఏపీలో క‌రోనా మ‌హ‌మ్మారి ఒక్క‌సారిగా పురికొల్పింది. మంగ‌ళ‌వారం ఒక్క రోజే ఏకంగా 17 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక మంగ‌ళ‌వారం కేసుల‌తో ఏకంగా 40కు చేరుకున్నాయి పాజిటివ్ కేసులు. ఇక ప‌రిస్థితి ఒక్క‌సారిగా సీరియ‌స్ అవ్వ‌డంతో క‌రోనాను ఏపీ నుంచి తరిమికొట్టేందుకు వైఎస్సార్‌సీపీ యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తం సిద్ధ‌మౌంది. ఈ క్ర‌మంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రుల‌కు, ప్ర‌భుత్వ అధికారుల‌కు పిలుపు ఇచ్చారు. అలాగే క‌రోనా విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో కూడా చెప్పారు. ఈ సూచ‌న‌లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

 

 -  ప్ర‌తి ఒక్క‌రు సోష‌ల్ డిస్టెన్స్‌తో పాటు భౌతిక దూరం పాటిస్తూ  ప్రజలు గుంపులు గుంపులుగా సంచరించకుండా అప్రమత్తం చేయాలి. 

 - మీ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్నది గమనించాలి. 

 -  ప్ర‌జ‌ల‌కు అందే నిత్యావ‌స‌రాల పంపిణీలో ఎక్కడైనా లోపాలుంటే వెంటనే అధికారుల దృష్టికి తెచ్చి సమన్వయంతో అందరికీ నిత్యావసరాలు అందేలా చూడాలి.

 -  మార్కెట్‌లో నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయించకుండా పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని  అప్రమత్తం చేయాలి.


 
 - అనాథలు, అన్నార్తులకు ఆహార సదుపాయాలు కల్పించాలి. అనారోగ్యానికి గురైన వారికి తక్షణ వైద్య సేవలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

 - గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా చూడాలి. ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సైతం రైతులు పొలం ప‌నులు చేసుకోవాల‌ని.. ఈ విష‌యంలో ఎవ్వ‌రిని ఇబ్బంది పెట్ట‌వ‌ద్ద‌ని... అయితే పొలంలో కూడా రైతులు సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని పిలుపు ఇచ్చారు.

 - వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించుకునే రైతులకు మేలు జరిగేలా చూడాలి.

 -  కార్మికులు, వ్యవసాయ కూలీలకు భోజన వసతి కల్పించడంతోపాటు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏప్రిల్‌ 14 వరకు విధిగా ఇంటికే పరిమితమయ్యేలా ప్రజలను చైతన్యపరచాలి.    

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: