బుర్రా మధుసూదన్‌ యాదవ్‌... కనిగిరి నియోజకవర్గ ప్రస్తుత శాసన సభ్యులు. హెరాల్డ్ విజేతల జాబితాలో చెప్పుకోవాల్సిన రాజకీయ నాయకులలో ఒకరు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కనిగిరి అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా కృంగిపోకుండా ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసాడు. కనిగిరి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో ఆయన తిరగని గ్రామం లేదు, పోరాడని సమస్య లేదు. నీటి సమస్య నుండి మొదలుకొని ఫ్లోరైడ్ సమస్య దాకా ప్రతీ సమస్య మీద పోరాటం చేసాడు. ఆయన రాజకీయ జీవితం మొత్తం ప్రజా సమస్యలపై పోరాటానికే కేటాయించారు. ప్రతిపక్షంలో ఉండగా నియోజకవర్గ ప్రధాన సమస్య అయిన నీటి సమస్య పరిష్కారానికి కృషి చేసారు.

 

IHG

ప్రభుత్వం నుంచి కనీస సహకారం లేక, డయాలసిస్‌ కేంద్రాలు లేక అనేక మంది యువకులు కిడ్నీ ఫ్లోరైడ్‌ వ్యాధితో మరణిస్తున్నట్లు గుర్తించారు బుర్రా. ఫ్లోరైడ్‌ సమస్య అత్యధికంగా కనిగిరిలోనే ఉందని..అనేక మంది కిడ్నీ బాధితులు డయాలసిస్‌ లేక చిన్న వయసులోనే చనిపోతున్నారని, సురక్షిత నీటి జలాలు లేక ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి 2017 జనవరి 20న పీసీపల్లి మండలంలో భారీ ధర్నా చేశారు. ఈ ధర్నాతో అధికార పార్టీ వెన్నుల్లో వణుకు పుట్టింది. వెంటనే కనిగిరితో పాటు మరో మూడు నియోజకవర్గాలకు డయాలసిస్‌ కేంద్రాలు మంజూరు చేశారు. కనిగిరిలో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు ఒక విధంగా బుర్రా బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ పుణ్యమనే చెప్పాలి. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సేవాహిత కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ ఎందరో పేదలను ఆదుకున్నాడు..అనాథ పిల్లలను దత్తత తీసుకున్నాడు. అందుకే  2019 సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ కనిగిరి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనకు ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. 1955 సంవత్సరం మొదలుకొని కనిగిరి నియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడు సాధించని భారీ మెజారిటీతో విజయ ఢంకా మ్రోగించాడు. చిర స్థాయిగా నిలిచిపోయే ఈ విజయం ద్వారా కనిగిరి నియోజకవర్గంలో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు.

 

అభిమానులు ముద్దుగా మదన్న అని పిలుచుకొనే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు తొలి నుంచి సౌమ్యుడిగా పేరుంది. కుల, మత బేధాలు లేకుండా చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలుకరించేతత్వం ఆయన సొంతం. భోళా శంకరుడు. కల్మషం లేని వ్యక్తి. కనిగిరి నియోజకవర్గ పరిధిలో ఉంటూ అందరి మనిషిగా పేరొందారు. పేద, ధనిక తేడా లేదు. గర్వం అనేది ఉండదు. అడిగిన వారికి ఎంతో కొంత సాయం చేయాలనే నైజం. ముందు ఎదుటి వారి మాట పూర్తిగా విన్న తర్వాత చిరునవ్యుతో స్పందిస్తూ అతనికి సమాధానం చెప్పడం బుర్రా గొప్పతనం. ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టడం బుర్రా నైజం. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యవుతారు. దివ్యాంగ, అనాధ పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలన చూస్తూ మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు.రాజకీయ జిమ్మిక్కులు తెలియవు. ఈ లక్షణాలే ఆయన్ని ప్రజల మనిషిగా, నిజమైన నాయకుడిగా నిలబెట్టాయి.

 

IHG

ప్రస్తుతం కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా సీఎం జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో కనిగిరి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కుల, మత, పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను లేవనెత్తుతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలో నియోజకవర్గ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి కనిగిరి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నారు. నిరంతరం ప్రజా సంక్షేమానికి పాటు పడుతూ, ఓటమిని లెక్క చేయకుండా విజయం సాధించే వరకు పోరాడిన బుర్రా మధుసూదన్ ను విజేతగా చెప్పుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: