చైనాలో పుట్టి ప్రపంచంలోని అన్ని దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇది ముందుగా చైనా దేశాన్ని అతలాకుతం చేసింది. ఆ తర్వాత అమెరికా, యూరప్, ఇండియా, తదితర దేశాలకు పాకింది. ప్రస్తుతం ఆ దేశాలన్నీ కరోనా దెబ్బకు అల్లాడిపోతుంటే, చైనా మాత్రం దాన్ని బాగా కంట్రోల్ చేస్తుంది. చైనాలో కరోనా వైరస్‌ని ఎలా కంట్రోల్ చేశారో తెలుస్కుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. వారు పాటించిన విషయాలు ఎప్పుడైనా అవసరమైతే ఇంప్లిమెంట్ చేయొచ్చు. చైనాలో దాదాపు 81వేల కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల నమోదు బాగా తగ్గిపోయింది. వుహాన్‌లో రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను క్రమక్రమంగా తీసివేస్తున్నారు. పైగా గత నెల రోజుల నుంచి చైనాలో కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గింది. ఇది ఎలా సాధ్యమైందో వుహాన్ యూనివర్శిటీలోని రెన్మిన్ హాస్పిటల్‌లో అంటువ్యాధుల విభాగం డైరెక్టర్ అయిన డాక్డర్ గోంగ్ జవోజియోంగ్ స్పష్టంగా వివరించారు. వారు చెప్పిన విషయాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

 

 

ముందు వరుసగా పెరుగుతున్న కేసుల్ని ఆపేందుకు, పెద్ద సంఖ్యలో ప్రజలకు టెస్టులు జరిపారు. కరోనా లక్షణాలున్న అందర్నీ ఐసోలేషన్ వార్డుల్లో ఉంచారు. అనుమానితులను కూడా ఇళ్లలో ఉండనివ్వకుండా క్వారంటైన్ కు తరలించారు. అసలు ప్రారంభ దశలో ఉండగానే, వుహాన్‌లో ఉన్న యూనివర్శిటీ క్యాంపస్‌లనే హాస్పిటళ్లుగా మార్చుకొని ట్రీట్‌మెంట్ మొదలుపెట్టారు. సాధారణ ఆస్పత్రులను ప్రత్యేక కరోనా ఆస్పత్రులుగా మార్చారు. ఆపై 16 కొత్త ఆస్పత్రులను నిర్మించారు. ఇళ్లలో క్వారంటైన్ కాకుండా ఆస్పత్రుల్లోనే క్వారంటైన్ చేశారు. ప్రస్తుతం మన భారతదేశంలో ఇళ్లలో కూడా క్వారంటైన్ అమలవుతోంది. కానీ అది సరైన నిర్ణయం కాదని ఆయన తెలిపారు. చైనాలో ఎక్కడా కూడా సమూహాలు లేకుండా చేసారు. మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు.

 

 

రోజూ ఒక్కో ఆస్పత్రిలో 1000 దాకా టెస్టులు జరిపారు. అలా భారీగా టెస్టులు చెయ్యడం వల్లనే వైరస్ కంట్రోల్ అయ్యిందంటున్నారు. డాక్టర్లు ముందుగా వ్యాధి తీవ్రంగా ఉన్న కేసులకే ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి కొత్త కేసులు తగ్గుతూ వచ్చాయి. రెండు నెలల తర్వాత, అంటే ఇప్పటికి కూడా పూర్తి పరిశీలన, పర్యవేక్షణ కొనసాగుతూనే ఉంది. ఆ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఎక్కువ టెస్టులు నిర్వహించి, అనుమానితులందరినీ ఐసోలేషన్ లో ఉంచడం వల్లే  చైనా ఆ వైరస్ ను ఎదుర్కోవడంలో విజయం సాధించిందని చెప్పవచ్చు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: