వాహన దారులకు కేంద్ర ప్రభుత్వం.. శుభవార్త చెబుతోంది.. ప్రస్తుత కరోనా కష్టకాలంలో సదరు వాహన దారుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసినా.. అలాగే రిజిస్ట్రేషన్ ఎక్స్‌పైరీ అయినా.. డోంట్ వర్రీ అంటోంది కేంద్రం... ఇంతకీ విషయం ఏమంటే... కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం మూలంగా... వాహనదారులకు.. ఈ అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోంది.

 

ఫిబ్రవరి 1 తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్స్, రిజిస్ట్రేషన్ గడువు ముగిసినప్పటికీ, ఆ వాహనాలు.. అవసరం మేరకు నిత్యవసర సరుకుల రవాణా కోసం తిరగొచ్చని కేంద్రం ప్రకటించింది. అలాగే.. వాటి గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ.. అల్టిమేటం జారీ చేసింది. దీనితో సదరు డ్రైవర్ల లైసెన్స్, ముగిసినప్పటికీ... అఫీషియల్ గా దాని వేలిడిటీ జూన్ 30 వరకు ఉన్నట్టే అనుకోవాలి. ఇక ఈ విషయంలో ఏ పోలీసు అధికారైనా వాహన దారులను ఇబ్బంది పెట్టినట్లయితే చర్యలు తప్పవని సూచించింది.

 

అలాగే... సదరు వాహన దారులు కరోనా వైరస్ లాక్‌డౌన్ ముగిసిన తర్వాత తప్పని సరిగా రెన్యువల్ చేయడం మరిచి పోవద్దని కూడా పేర్కొంది. ఇదే విషయమై... కేంద్ర రోడ్డు రవాణా, మరియు రహదారుల మంత్రిత్వ శాఖ... డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్స్, రిజిస్ట్రేషన్ గడువును జూన్ 30 వరకు పొడిగించినట్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అఫీషియల్ గా అడ్వైజరీ జారీ చేసినట్లు తాజాగా ప్రకటించింది.

 

ముఖ్యంగా... నిత్యావసర వస్తువులు, సరుకులు.. ప్రజలకు చేరవేయడంలో ఎలాంటి ఇబ్బందులు  తలెత్తకూడదని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది కేవలం సదరు ప్రత్యేకమైన డ్రైవర్లకు మాత్రమే వర్తింపజేస్తున్నట్లు తెలుస్తుంది. మాములు ద్విచక్ర వాహన దారులకు మాత్రం ఇది వర్తిస్తుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి వుంది... దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది...

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: