ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఆదివారం ఒక్క రోజు తగ్గిన కేసులు అక్కడి నుంచి మళ్ళీ ఊపందుకున్నాయి. అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా సరే వైరస్ మాత్రం కట్టడి అయ్యే పరిస్థితిలో లేదు. గంట గంటకు అది వేగంగా విస్తరిస్తుంది. దీనితో ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. 

 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య... దాదాపు 7 లక్షల 90 వేలకు చేరువలో ఉండగా మరణాలు 40 వేలకు దగ్గరలో ఉన్నాయి. ముందు మరణాలు తక్కువగానే ఉన్నా ఇప్పుడు మాత్రం అవి పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. కరోనా కట్టడికి చర్యలు ఫలించడం లేదు. అమెరికాలో కరోనా కేసులు ఒక లక్షా 70 వేలు దాటినట్టు సమాచారం. అదే విధంగా అమెరికాలో 3500 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

 

స్పెయిన్, జర్మని, ఫ్రాన్స్, బ్రిటన్ లో చైనా కరతాళ నృత్యం చేస్తుంది. ప్రభుత్వాలు దాదాపుగా చేతులు ఎత్తేసినట్టే కనపడుతుంది. మన దేశంలో కూడా కేసులు పెరుగుతున్నాయి. రెండో దశను దాటి మూడో దశకు కరోనా వైరస్ ప్రవేశించింది. తెలంగాణాలో 72 కరోనా కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ లో  మంగళవారం 17 కరోనా కేసులతో మొట్ట 40 కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తుంది.   దేశ వ్యాప్తంగా 1300 కి చేరువలో కరోనా కేసులు ఉన్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: