దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కరోనా అన్న మాటే వినిపిస్తుంది.  దేశ వ్యాప్తంగా కరోనా ని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించారు.  ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అందరూ ఇంటిపట్టున ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.  కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ, పట్టించుకోకుండా, రోడ్లపై తిరుగుతున్న వారిపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్న సిద్దిపేటలో హరీశ్ రావు పర్యటించగా, పలువురు తమ ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురితో కలిసి వెళుతుండటాన్ని గుర్తించి, వారిని ఆపారు.  మేం ఒక్కరం బయటకు వస్తే ఏం అవుతుందని ప్రతి ఒక్కరూ అనుకుంటే కరోనా ఎలా కట్టడి అవుతుందని ప్రశ్నించారు.  కరోనా వైరస్‌ కు మందే లేదు.

 

స్వీయ నిర్బంధం, సామాజిక దూరం పాటించడమే మన ముందున్న సమస్యకు ఏకైక పరిష్కారం. ఈ వైరస్‌ ను చూసి ప్రపంచమే గడగడలాడుతోంది. మీరేమో పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ క్లాస్ పీకారు.   మీ కోసం రోడ్లపై పోలీసులు ప్రాణాలకు తెగించి కాపలా కాస్తున్నారని..  డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.  ఏకంగా ముఖ్యమంత్రి ప్రతీక్షణం సమీక్షలు నిర్వహిస్తూ.. అప్డేట్ చేస్తున్నారని.. అయినా మీరు ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. 

 

వందలాది మంది అధికారులు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజల కోసం పని చేస్తుంటే, వారికి సహకరించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.తమ వైఖరిని మార్చుకోకపోతే కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కరోనా వ్యాధిని ఎదుర్కొనేందుకు సీఎం సహాయనిధికి దాతలు విరివిగా విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా హరీశ్ రావు కోరారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: