కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. సామాజిక దూరం పాటించడం ద్వారానే ఈ వైరస్ వ్యాప్తి ని అరికట్టే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు రోడ్లపైకి రాకుండా కట్టడి చేయడంతో పాటు మొత్తం ఏప్రిల్ 14వ తేదీ వరకు కర్ఫ్యూను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఆదాయానికి పూర్తిగా గండి పడిపోయింది. ప్రస్తుతం కరోనా వైరస్ అడ్డుకునేందుకు కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తే ఆందోళనకరంగా ఉంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలు లో ఉన్న అన్ని హామీలను అమలు చేయడమే తన పని అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తూ వస్తున్నారు. 

IHG


ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారి చుట్టుముట్టడంతో ఏపీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టమైన పరిస్థితి నెలకొంది. దీంతో ఈనెల ఉద్యోగులకు జీతాలు ఇచ్చే అవకాశం లేదని ప్రచారం జరిగినా ఉద్యోగుల జీతాలకు ఎటువంటి డోకా లేదని ప్రభుత్వ    పెద్దలు కొంతమంది ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా జగన్ ఒక్క పిలుపు ఇస్తే ఏపీకి విరాళాలు పెద్ద సంఖ్యలో వచ్చి పడతాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే జగన్ ఒకసారి ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరితే ఇచ్చేందుకు వేలాది మంది సిద్ధంగా ఉంటారు. దీనికి కారణం జగన్ అంటే అభిమానం ఉండడమే. 

 


అదీకాకుండా పార్టీలో జగన్ కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్న కుబేరుల జాబితా కూడా ఎక్కువే. ఈ పరిస్థితుల్లో జగన్ కనుక నిధులు విషయమై పిలుపునిచ్చి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని ఏపీ ఆర్థిక పరిస్థితి కొంతలో కొంత బెటర్ అయ్యేదని వాదనలు వినిపిస్తున్నాయి. అయినా జగన్ మాత్రం ఆ విధంగా గెలుపు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. అయినా ఇప్పటికే ఏపీ సీఎం సహాయనిధికి కొంతమేర విరాళాలు వస్తుండడం కొంతలో కొంత ఊరట కలిగించే అంశంగా కనిపిస్తోంది.


 



మరింత సమాచారం తెలుసుకోండి: