ఏపిలో కొత్త టెన్షన్ పట్టకుంది. మత ప్రార్ధనల కోసం ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రానికి తిరిగొచ్చిన వారు తీసుకొచ్చిన టెన్షన్ ఇది. కరోనా వైరస్ సమస్య ముదరకముందు ఢిల్లీకి వెళ్ళి సమస్య తీవ్రమైన సమయంలో 884 మంది సొంతూర్లకు తిరిగొచ్చారు. దాంతో  వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. 30వ తేదీ వరకు కేవలం 23 మంది మాత్రమే ఉండగా 31వ తేదీకి ఆ సంఖ్య ఒక్కసారిగా 40కి పెరిగిపోయింది. దాంతో ఏప్రిల్ 1, 2 తేదీల్లో బాధితుల సంఖ్య మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందనే టెన్షన్ అందరిలోను పెరిగిపోతోంది.

 

ఢిల్లీకి వెళ్ళిన 884 మంది రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారు. ఇప్పటి వరకూ బయటపడిన కేసుల్లో అత్యధికులు ప్రకాశం జిల్లా వాళ్ళే. దాంతో మిగిలిన జిల్లాల్లో కూడా వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోవటం ఖాయమనే అంచనా వేస్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వారిలో చాలామందిని ఐసొలేషన్ సెంటర్లు, క్వారంటైన్ కేంద్రాలకు తరలించేశారు. పరీక్షలు కూడా చేస్తున్నారు.

 

పరీక్షలకు పంపిన   బ్లడ్ శాంపుల్స్  రిజల్ట్స్ రావాల్సుంది. అవి వస్తే వైరస్ ఎంతమందికి సోకిందనే విషయం క్లారిటి వస్తుంది. అయితే ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వారిలో కనీసం సగంమందికన్నా ఎక్కువ మందికే వైరస్ సోకుంటుందని అనుమానిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవటం ఖాయం. దాంతో అందరి దృష్టి ఇపుడు రావాల్సిన రిజల్ట్స్ మీదే కేంద్రీకృతమైంది.

 

అదే సమయంలో ఢిల్లీకి వెళ్ళి వచ్చిన 884 మందిలో కొందరు ప్రభుత్వానికి దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నట్లు అనుమానంగా ఉంది. అందుకనే ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వారే కాకుండా వాళ్ళ కుటుంబసభ్యులు, సన్నిహితుల వివరాలను కూడా సేకరించి అందరికీ ఐసొలేటషన్ కేంద్రాలకు తరలించాలని అనుకుంది. ఇందుకే ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వారిలో కొందరు కావాలనే మిస్ అయినట్లు అనుమానంగా ఉంది. వాళ్ళ కోసమే వెతుకున్నారు. వాళ్ళెపుడు దొరకుతారో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: