దేశంలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసి దేశం నుంచి పారదోలేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తూ  సంచలనం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రవాణా వ్యవస్థను పూర్తిగా మూసి వేస్తూ... దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఇంటికి మాత్రమే పరిమితం కావాలని పిలుపునిచ్చింది. కాగా దేశ ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు లాక్ డౌన్  అనుసరిస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలా మటుకు ప్రజలు ఎవరూ ఇంటి నుంచి కాలు బయట పెట్టడం లేదు. ఇక తాజాగా కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. 

 

 

 కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్ డౌన్ వల్ల పూర్తి స్థాయిలో ఫలితాలు రాకపోయినప్పటికీ ప్రస్తుతం చాలా వరకు... కరోనా  వైరస్ను దేశంలో నియంత్రించగలిగాము  అంటూ కిషన్ రెడ్డి  అన్నారు. కరోనా  వైరస్కు వ్యాక్సిన్ లేకపోవడం కారణంగా నివారణ ఒక్కటే మార్గం అని... అందుకే ప్రతి ఒకరు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం తో పాటు సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని... లేనిపక్షంలో ఈ మహమ్మారి వైరస్ ను నిరోధించడం అసాధ్యమైన పని అంటూ తెలిపారు కిషన్ రెడ్డి. అందుకే కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు లాక్ డౌన్  ఒక్కటే సరైన మార్గం అంటూ తెలిపారు.

 

 

 

 అయితే దేశంలో కొన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్నారని... ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని ఆపేందుకు కాల్పులు చేయలేము అంటూ స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిందని అంటూ తెలిపిన కిషన్ రెడ్డి .. ప్రస్తుతం దానిని కట్టడి చేయగలిగాము  అంటూ తెలిపారు. సరిహద్దుల అన్నింటికీ మూసివేయాలని ఉత్తర్వులు ఇచ్చామని ఇది ఎవరు ఉల్లంఘించకుండా ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. లాక్ డౌన్  నేపథ్యంలో 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంటూ గుర్తు చేసిన కిషన్ రెడ్డి... కేంద్ర ప్రభుత్వ పిలుపుమేరకు ప్రజలందరూ నిబద్ధతతో ఉండి మహమ్మరి  వైరస్ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ పొడిగించే  అవకాశం లేదు అంటూ హోం మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: