ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు గంట గంట గంటకు పెరుగుతున్నాయి. ఇటలీ, స్పెయిన్, అమెరికా, భారత్ ఇలా దాదాపు అన్ని దేశాల్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా విస్తరిస్తున్నాయి. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదు అయిన కేసులు 7, 88, 054గా ఉన్నాయి. వీరిలో 37, 877 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవర్ అయిన వారు 1, 66, 424. 

 

ఇప్పుడు చికిత్స తీసుకుంటున్న వారు... 5, 83, 753 మంది. వారిలో 5, 54, 192 (95%) మంది ఆరోగ్యం నిలకడగా ఉండగా 29, 561 (5%) మంది ఆరోగ్యం విషమంగా ఉంది. అమెరికాలో కరోనా బారిన 1, 64, 359 పడ్డారు. వారిలో 3,173 మంది మరణించగా ఇవాళ ఒక్క రోజే 600 పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇటలీలో 1 01, 739 మందికి కరోనా సోకింది. వారిలో 11 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువగా వృద్దులు ఉన్నారు. 

 

మరికొంత మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,251 గా ఉండగా వారిలో 102 మంది కోలుకున్నారు. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువగా కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. వారిలో 20 మందికి కరోనా లక్షణాలు ఉన్నాయి. కొంత మంది క్వారంటైన్ లేకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: