2019 డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచ దేశాల‌ను చుట్టేసింది.  ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ఎఫెక్ట్‌‌కి ఇప్పటికే 35 వేలకి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇక దీని బాధితులు ల‌క్ష‌ల్లో ఉన్నారంటే.. ఈ మ‌హ‌మ్మారి ఏ రేంజ్‌లో వ్యాప్తిచెందుతుందో స్ప‌ష్టంగా తెలుసుకోవ‌చ్చు. ఇది ఇంకా ఎన్ని దేశాలకు వ్యాపిస్తుందో, ఇంకెంతమంది దీని బారిన పడతారో అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలందర్నీ భయపెడతూ.. ప్రళయ తాండవం సృష్టిస్తోంది ఈ క‌రోనా. 

 

కాగా ఈ వైరస్ సోకితే చనిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అది నిజం కాదు. ఇప్పటివరకూ ప్రపంచంలో కరోనా వైరస్ సోకిన వారిలో 18 శాతం మంది మాత్రమే చనిపోయారు. ఇక కరోనా లక్షణాలు బయటపడితే.. వెంటనే ఆసుపత్రికి రావాలని సూచిస్తున్నాయి. జ్వరం,నీరసం,పొడి దగ్గు.. వీటిని కరోనా లక్షణాలుగా చెబుతున్నారు. క్రమంగా వీటి తీవ్రత పెరగవచ్చు. వైరస్ సోకిన ఐదు రోజుల తర్వాత ఈ లక్షణాలు బయటపడుతాయి. ఇవ‌న్నీ  ప్రపంచ ఆరోగ్య నిపుణులు ఇప్పటికే తేల్చి చెప్పారు.

 

అయితే క‌రోనా సోకింద‌ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే తెలుసుకోవ‌చ్చు. అవును! శరీరంలోకి వైరస్ ప్రవేశించిన గంటల్లోనే రెండు కొత్త లక్షణాలు బయటకు వస్తాయని బ్రిటన్‌కు చెందిన ఈఎన్టీ వైద్యులు వెల్ల‌డించారు. వైరస్‌ సోకిన వారు తొలుత వాసనను గుర్తించలేరని, ఆపై తినే ఆహార పదార్థాల రుచిని కూడా కోల్పోతారని తెలిపారు. ఎందుకంటే..  వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరడానికి ముందు ముక్కులో ఆగుతుందని, అందువల్ల వాసన చూసే సామర్థ్యం పోతుందని వారు స్ప‌ష్టం చేశారు. ఇక ఈ లక్షణాలు కనిపిస్తే, రోగ నిరోధక శక్తి అధికంగా ఉండే యువత వైరస్ బారిన పడినప్పటికీ అన్ని లక్షణాలూ బయటపడేలోపే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. సో.. బీకేర్‌ఫుల్‌..!!

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: