ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మన దేశంలో కూడా విలయతాండవం చేస్తుంది.  దేశంలో కరోనాని అరికట్టేందుకు.. దాని వ్యాప్తిని రూపుమాపేందుకు లాక్ డౌన్ చేశారు. అంటే ప్రతి ఒక్కరూ ఇంటిపట్టున ఉండాలని ఆదేశాలు.  ఈ నేపథ్యంలో ఇబ్బందులు పడే వారికి పోలీసులు, డాక్టర్లు ఎప్పుడు సహాయం చేయడానికి రెడీగా ఉంటున్నారు.  తెలంగాణలో డయల్‌ 100కు ప్రజల నుంచి ఫోన్‌ కాల్ చేస్తే వెంటనే పోలీసులు స్పందిస్తారని.. బాధితుల వద్దకు చేరుకుంటారని తెలిసిందే. 

 

ఈ నేపథ్యంలో  డయల్‌ 100కు ప్రజల నుంచి ఫోన్‌కాల్స్‌ పెరిగాయని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూడు రోజుల వ్యవధిలో 100 నంబరుకు 6.4 లక్షల కాల్స్‌ వచ్చాయని ఆయన తెలిపారు. అయితే తెలంగాణలో చాలా మంది తమ ఇంటికి పరిమితం అవుతున్నా.. కొంత మంది మాత్రం రోడ్లపై సంచరిస్తూ.. వాహనాలపై వెళ్తూ లాక్ డౌన్ ఉల్లంఘన చేస్తున్నారని అన్నారు. 

 

కొంతమంది తమకు కరోనా అనుమానితుల సమాచారం ఇస్తున్నారని చెప్పారు. కాగా, హైదరాబాద్‌లో ఎక్కడా కూడా వాహనాల రద్దీ లేదని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. అనుమతి ఉన్న వాహనాలు తిరిగేలా ట్రాఫిక్‌ పోలీసులు చూస్తున్నారని చెప్పారు. అనవసరంగా బయటకు వచ్చిన వారికి మాత్రమే జరిమానా విధిస్తున్నామని తెలిపారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: