ప్ర‌పంచ ప్ర‌జ‌లంద‌రినీ వ‌ణికిస్తున్న వ్యాధి క‌రోనా. ఈ మ‌హ‌మ్మారి గ‌త కొంత కాలంగా ఎవ్వ‌రినీ ప్ర‌శాంతంగా నిద్ర‌పోనివ్వ‌డంలేదు. ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌డంలేదు. అంతే కాకుండా ఎటు చూసినా అదే వార్త‌. అదే న్యూస్‌. అన్ని వార్త‌ల్లోనూ క‌రోనా జాగ్ర‌త్త‌లే. ప్ర‌తి దాంట్లో చెప్పేది మెయిన్‌గా ఎవ‌రికివారు శ‌భ్ర‌త అనేది పాటించాల‌ని అలాగే మ‌నిషికి మ‌నిషి క‌నీస దూరం అనేది ఎంతో జాగ్ర‌త్త‌గా పాటించాల‌ని తెలిపారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వాలు కూడా ఈ వ్యాధి పై ముమ్మ‌రంగా అవ‌గాహ‌న అనేది క‌ల్పిస్తున్నారు. ఒక ప్ర‌భుత్వాలు స్వియ నిర్బంధంలో ఉండ‌మంటున్నారు. అవ‌స‌ర‌మ‌యితే త‌ప్పించి బ‌య‌ట‌కు రావొద్దంటున్నారు. అయితే  క్లీనింగ్ కోసం ఉపయోగించే ఆ ప్రాడక్ట్స్ వైరస్ ను ఎంత వ‌ర‌కు మ‌న ద‌రి చేర‌కుండా చూస్తాయి. అలాగే  కట్టడి చేయగలవా అనేది ఇప్పుడు ఇక్క‌డ చూద్దాం.

 

ముందుగా ఈ వైర‌స్ వ్యాప్తిని నివారించాలి. ఆ త‌ర్వాత‌ తరచుగా చేతులతో పాటు ఇంటిని, ఇంట్లోని వస్తువులను శుభ్రప‌రుచుకోవాలి. ఇందుకోసం ఉపయోగించే ప్రొడక్ట్స్  కూడా వైరస్ కట్టడి చేయగలవై ఉండాలి. మరి మనం తరచూ ఉపయోగించే ఇంటి క్లీనింగ్ పద్ధతులు కరోనా వైరస్ ను  ఎంత మేర ర‌క్షిస్లాయ‌ని  ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. చాలా మంది శుభ్ర‌త అంటే ముందుగా వాడేది స‌బ్బులు. సబ్బునీళ్లు చేతులకు వైరస్ సోకితే అది శరీరంలోకి ప్రవేశించకుండా వెంటనే చేతుల్ని శుభ్రపరు చుకుంటే సరిపోతుంది. కానీ ఆ వైరస్ ఇంట్లోని ఉపరితలాలను చేరితే.. అది అక్కడ కొన్ని రోజు లపాటు బతికే ఉంటుంది. ఈ నాలుగు రోజులు ఇంట్లో వ‌స్తువుల‌ను కూడా వీల‌యినంత వ‌ర‌కు ఒక రెండు, మూడు చుక్క‌లు చ‌ప్పున డెట్టాల్ నీళ్ళ‌లో క‌లిపి శుభ్ర‌ప‌రిస్తే చాలా మంచిది. కానీ, ఇంటి క్లీనింగ్ అంటే సబ్బు నీళకే ఎ్ల క్కువ ఇంపార్టెన్స్ చూపుతారు చాలామంది. 

 

సబ్బు నీళ్లు ఇల్లంతా చల్లి గదుల్ని కడుగుతారు. కానీ ఆ సబ్బునీళ్ల వల్ల వైరస్ ఉపరితలం నుంచి పోతుందే తప్ప చనిపోదు. అందుకే ఈ సమయంలో ఇంటి క్లీనింగ్ కు సబ్బునీళ్లు  బదులు డెట్టాల్ కొంచం ఉప్పు, ప‌సుపు వేచి ఇల్లు తుడుచుకోవాలి. అలాగే రెండు రోజుల‌కి ఒక‌సారైనా ఇంట్లో సాంబ్రాణీ వేయాలి. బొగ్గుల‌ను గ్యాస్ మీద కాల్చి సాంబ్రాంణి తెచ్చి పొగ వేసుకోవాలి. డూప్‌స్టిక్స్ కంటే కూడా ఇది చాలా మంచిది. ఇక మ‌నం ఎక్కువ‌గాతాకే వీలు ఉండే టేబుళ్లు, తలుపుల గడియలు, నాబ్స్, స్విచ్లు, హ్యాండిల్స్, ఫోన్లు, కీ బోర్డులు, మరుగుదొడ్లు, సింక్లు మొదట సబ్బు నీళతో శుభ్రం చేసిన తర్వత ఇతర క్లీనింగ్ పద్ధతుల్ని కూడా ఫాలో అవ్వాలి. అలాగే వేపాకుని బాగా నూరి అది నీళ్ళ‌ల్లో క‌లిపి ఇంటి గోడ‌ల పైన ఆ నీళ్ళ‌ను స్ప్రే చేసినా కూడా చాలా మంచిది. వేపాకు అంటే యాంటిబ‌య‌టిక్ లాంటిది అది చీడ పురుగును చంపేస్తుంది. అలాగే   బ్లీచింగ్ పౌడ‌ర్‌ని కూడా  ఇంట్లోని వైరస్ ను  కట్టడి చేయడంలో కీరోల్ ప్లే చేస్తుంది. బ్లీచ్ ను  10 నుంచి 15 నిమిషాల పాటు ఫ్లోర్ మీద చల్లి గుడ్డతో తుడిస్తే వైరస్ చనిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్ధ‌తిలో క్లీనింగ్ కోసం ఐదు టేబుల్‌ స్పూన్ల బ్లీచిం గ్ పౌడర్‌ను నాలుగు లీటర్ల నీళ్లలో కలిపి వాడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: