ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. గంట గంట కు పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు దీనిని ఏ విధంగా అదుపు చెయ్యాలి అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. కరోనా కట్టడి చేయడానికి గాను ఎన్ని చర్యలు తీసుకున్నా సరే వేగంగా కేసులు పెరుగుతున్నాయే గాని తగ్గడం లేదు. అన్ని దేశాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది ఇప్పుడు. 

 

గంట క్రితంకి ఇప్పటికి కరోనా కేసులు రెండు వేల వరకు పెరిగాయి. ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 789,236గా ఉండగా మరణాల సంఖ్య కూడా అలాగే పెరిగింది. 38,092 మంది ప్రాణాలు కోల్పోయారు. 166,675 మందికి కరోనా రికవర్ అయింది. 554,808 మంది ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. జర్మని, స్పెయిన్, ఇటలీలో కేసుల సంఖ్యతో పాటుగా మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరగడం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. 

 

అక్కడి ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా సరే ఇది మాత్రం కట్టడి అవ్వడం లేదు. మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఇప్పుడు 1300కి దగ్గరగా ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 5 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో ఈ ఒక్క రోజే కరోనా కేసులు 17 నమోదు అయ్యాయి. దీనితో ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: