ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వాలు ఇప్పుడు దాన్ని కట్టడి చేయడానికి గానూ కాస్త వినూత్నంగా ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాయి. జనాలు మాట వినకపోవడంతో ఇప్పుడు చట్టాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగించి కట్టడి చేయడానికి సిద్దమవుతున్నాయి. లాఠీ దెబ్బలు పట్టించుకోవడం లేదు. మంచి మాటలు చెప్పినా వినడం లేదు. 

 

దీనితో ఇప్పుడు కర్ణాటక సర్కార్ కాస్త వినూత్నంగా ఆలోచించడం మొదలు పెట్టింది. అది ఏంటీ అంటే... ఇప్పుడు కొంత మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళను హోం క్వారంటైన్ లో ఉంచింది ప్రభుత్వం. ఇప్పుడు వారు మాట వినకుండా రోడ్ల మీదకు తిరగడం మొదలుపెట్టారు. దీనితో కర్ణాటక ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఒక సేల్ఫీ దిగి దాన్ని ఒక యాప్ లో అప్లోడ్ చెయ్యాలి. 

 

ఈ ఫోటోలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది ప్రభుత్వ టీం ఒకటి. గంటకు గంటకు సేల్ఫీ లేకపోతే మాత్రం వాళ్ళను కచ్చితంగా హోం క్వారంటైన్ నుంచి మాస్ క్వారంటైన్ కి తరలించడం ఖాయం. అయితే దీన్ని తప్పుదోవ కూడా పట్టించవచ్చు. గంట గంటకు సెల్ఫి దిగలేను అనుకునే వాళ్ళు ఒక్కసారే ఫోటో లు దిగి గంట గంటకు అప్లోడ్ చేయవచ్చు. వాళ్ళ సమాచారం తెలియకుండా ఉండటానికి ఫోన్ ని ఇంట్లో పడేసి బయట తిరగవచ్చు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: