ప్రజల ప్రాణాలను హరిస్తున్న కరోనా వలన ఒకవైపు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదేలుమన్నప్పటికీ... పలు దాతలు వైరస్ నివారణకై, కోట్ల రూపాయిలను విరాళాలుగా ప్రకటించడం హర్షించ దగ్గ విషయం. ఆ కోవలోనే భారత్ లాక్ డౌన్ లో వున్న కారణంగా.. క్రికెట్ క్రీడాకారుడు రోహిత్‌ తమవంతు సాయాన్ని ప్రకటించారు. పీఎం కేర్స్‌కు రూ.45 లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.25 లక్షలు, ఫ్రీ ఇండియా స్వచ్ఛంద సంస్థకు, వెల్ఫేర్‌ ఆఫ్‌ స్ట్రే డాగ్స్‌కు రూ. 5 లక్షల చొప్పున సాయం చేశారు.

 

అందరికి తెలిసినటువంటి.. కరోనా వైరస్‌ సహజ లక్షణాలు అయిన జలుబు, దగ్గు, జ్వరం కాకుండా.. ఇపుడు మరి కొన్ని కొత్త లక్షణాలను వైద్యులు కనుగొన్నట్లు తెలుస్తోంది. సదరు బాధితులు వీటితో పాటుగా గ్రాహక శక్తిని, రుచిని కోల్పోతున్నారని చెబుతున్నారు. అయితే పీడితులలో ఈ రకమైన లక్షణాలు బయట పడడానికి వైరస్‌ సోకిన రెండు రోజుల నుంచి 14 రోజుల వరకు పట్టడం గమనార్హం. అయితే అప్పటికే బాధితుడి పుణ్యకాలం గడిచిపోతుంది.

 

ఇక ప్రపంచదేశాల కంటే, మన దగ్గర కేసుల సంఖ్య బాగా తక్కువ అని భావిస్తున్న తరుణంలో ఇపుడు కొత్తగా పెరిగిపోతున్న కేసులు, ఒకింత కలవరానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 12 గంటల్లో 17 కొత్త కేసులు నమోదు అవ్వడం.. బాధాకరమైన విషయం. ఒక్క ప్రకాశం జిల్లాలోనే అత్యధికంగా 11 కేసులు నమోదవ్వగా, చీరాల పట్టణంలో కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. ఇక పోతే ప్రపంచం మొత్తంగా కేసుల సంఖ్యను ఒకసారి పరిశీలించినట్లయితే...

 


ప్రపంచలో మొత్తం కేసులు: 7, 99 , 723
మరణాలు: 38, 721
రికవరీ కేసులు: 1, 69, 988

 

ఇండియాలో మొత్తం కేసులు: 1, 251 
మరణాలు: 32 
కొత్త కేసులు: 47
రికవరీ కేసులు: 102 

 

తెలంగాణలో మొత్తం కేసులు: 78
మృతులు: 6 
కొత్త కేసులు: 1 
యాక్టివ్ కేసులు: 61 
డిశ్చార్జి కేసులు: 14
ఏపీలో మొత్తం కేసులు: 40
మృతులు: 1 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: